CM రేవంత్ రెడ్డితో మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ భేటీ.. కారణం అదేనా?

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుస్తున్న బీఆర్ఎస్ నేతల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.

Update: 2024-02-11 11:40 GMT

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుస్తున్న బీఆర్ఎస్ నేతల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నేతలు వరుసగా సీఎంతో భేటీ అవుతున్నారు. ఈ క్రమంలో మరికొన్ని రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ కాబోతోందనే వార్తలు విస్తృతమవుతున్నారు. ఇదిలా ఉండగా.. మరో కీలక నేత ఇవాళ(ఆదివారం) సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ మర్యాదపూర్వకంగా కలిశారు.

కాగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో బొంతు రామ్మోహన్ బీఆర్ఎస్ నుంచి ఉప్పల్ నియోజకవర్గ టికెట్ ఆశించి భంగపడ్డారు. చివరివరకు ఎదురుచూసినా లాభం లేకుండా పోయంది. అనూహ్యంగా ఆ నియోజకవర్గ టికెట్‌ను బండారు లక్ష్మారెడ్డికి కేటాయించడంతో బొంతు రామ్మోహన్‌లో అసంతృప్తి పెరిగిపోయింది. ప్రస్తుతం మరోసారి బీఆర్ఎస్ నుంచి పార్లమెంట్ టికెట్ ఆశిస్తున్నారు. లోక్‌సభ సీటు కూడా దక్కే ఛాన్స్ లేకపోవడంతో పార్టీ మారాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారనే వార్తలు వినిపిస్తున్నారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. భేటీ అనంతరం బొంతు రామ్మోహన్ నోరు విప్పితే అసలు విషయం తెలియనుంది.

Tags:    

Similar News