తెలంగాణ భవన్‌లో మాజీ గవర్నర్ తమిళసై.. స్వాగతం పలికిన అధికారి

మాజీ తెలంగాణ గవర్నర్, బీజేపీ నేత తమిళసై సౌందర్‌రాజన్ తెలంగాణ భవన్‌ను సందర్శించారు.

Update: 2024-06-08 12:29 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: మాజీ తెలంగాణ గవర్నర్, బీజేపీ నేత తమిళసై సౌందర్‌రాజన్ తెలంగాణ భవన్‌ను సందర్శించారు. ఈ క్రమంలోనే ఆమె ఇవాళ ఎక్స్ వేదికగా ఫోటో పంచుకున్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో తనకు ఘన స్వాగతం లభించిందని పేర్కొంది. రెసిడెంట్ కమిషనర్ ఐఏఎస్ గౌరవ్ ఉప్పల్‌ స్వాగతం పలకారని వెల్లడించింది. అయితే, మూడోసారి భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్న నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కాబోతున్నారు. ఈ క్రమంలోనే ఆమె న్యూఢిల్లీకి వెళ్లారు.

మరోవైపు బీజేపీ నాయకులతో ఆమె సమావేశాల్లో పాల్గొంటున్నారు. కాగా, ప్రధానిగా నరేంద్ర మోడీ రేపు ఆదివారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. దాదాపు 8 వేల మంది ప్రత్యేక అతిథులు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ మహోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..