Former DSP Nalini: పీఆర్ స్టంట్ కోసం వాడుకుని వదిలేశారు: ప్రభుత్వంపై మాజీ డీఎస్పీ నళిని సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిన వేళ వెలుగులోకి వచ్చిన పేరు డీఎస్పీ నళిని.
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిన వేళ వెలుగులోకి వచ్చిన పేరు డీఎస్పీ నళిని. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం బతుకుదెరువైన ఉద్యోగాన్ని త్రుణప్రాయంగా వదులుకున్న చరిత్ర ఆమెది. ఉద్యమంలో కీలకంగా వ్యవహరిస్తూ అనతికాలంలోనే అందరి మన్ననలు పొందిన నళిని.. రాష్ట్ర ఆవిర్భావం తరువాత కనిపించకుండా పోయింది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో ఆమె మాటే వినిపించ లేదు. అనంతరం కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆమె అజ్క్షాతాన్ని వీడి బయటకు వచ్చారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.
దీంతో స్పందించిన సీఎం డీఎస్పీ ఉద్యోగం లేదా అందుకు సరితూగే పోస్టులో నియమించాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆయన స్పందనకు నళిని సంతోషం వ్యక్తం చేస్తూ.. మీడియా ముఖంగా ధన్యవాదాలు తెలిపారు. ఇంత వరకు బాగానే ఇప్పటి వరకు సీఎం ఆదేశాలు ఇప్పటి వరకు అమలు కాలేదు. ఆసలు తన విజ్క్షప్తిని పట్టించుకునే వారే కరువయ్యారని నళిని వాపోతోంది. తాజాగా, ఆమె ఫేస్‌బుక్ వేదికగా తన సందేశాన్ని పోస్ట్ చేశారు. ‘సీఎం సార్ కొలువుకు ఎక్కగానే నన్ను యాది చేసిండు. ఇప్పుడేమో సప్పుడే చేస్తలేడు. మధ్యల తెలంగాణ రాష్ట్ర దశాబ్ధి ఉత్సవాలు జరిగినాయి.
ఆశ్చర్యంగా నా ఊసే ఎత్తలేదు. ఇంతకీ నా రెండు దరఖాస్తులు బల్ల మీదే ఉన్నయో.. లేక చెత్తబుట్టలోకి పోయినవోనని డైట్ వస్తుంది. ఇప్పుడే చీఫ్ సీఆర్‌వో, ఓఎస్డీ సారును కదిలించిన.. చిట్టి రాసిన.. మా చిన్నప్పుడు ఆడుక్కొనేటోడు ఇంటి ముందుకు వస్తే, ఇంట్లో చల్లన్నం లేకపోతే పైకి ఎల్లవయ్య అని మెల్లగా చెప్పేటోళ్లం. కనీసం ఆ పాటి మర్యాద అయినా నాకు ఇస్తారేమో చూడాలి. అందుకే నేను ఇన్నేళ్లు ఎవ్వరినీ కలవాలే. ఉద్యమం చేసేటప్పుడే నాకు చాలా విషయాలు అర్థం అయినవి. ఒక నెలలో నా పిటిషన్ ఎంక్వైరీ పూర్తి చేస్తారు అనుకున్న. కానీ, ఏడు నెలలు కావొస్తోంది. అందుకే రిమైండర్ లెటర్, పోస్ట్ రాయాల్సి వచ్చింది. సెక్రటేరియట్ చూట్టూ తిరిగేంత సమయం, ఓపిక నా దగ్గర లేవు అని నేను ఆ రోజే రేవంతన్నకు చెప్పిన’. అంటూ డీఎస్పీ నళిని పోస్ట్ చేసింది.