‘ఆ పని చేయాలని మోడీ నన్ను బెదిరించారు’.. మాజీ సీఎం KCR సంచలన వ్యాఖ్యలు

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు కురిపించారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో చేవేళ్లలో బీఆర్ఎస్ శనివారం భారీ

Update: 2024-04-13 14:22 GMT

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు కురిపించారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో చేవేళ్లలో బీఆర్ఎస్ శనివారం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. అయితే మోడీ.. లేదంటే ఈడీ.. ఇదే బీజేపీ వైఖరి అని.. కేంద్ర దర్యాప్తు సంస్థలను పంపి ప్రతిపక్షాలను బెదిరించడమే మోడీ పనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పదేళ్లలో బీజేపీ ఈ దేశ ప్రజల కోసం ఏమైనా చేసిందా అని ప్రశ్నించారు. ప్రజల్లో మతపిచ్చి లేపి ఓట్లు దండుకోవాలని బీజేపీ చూస్తోందని విమర్శించారు. గత పదేళ్లలో దేశ వ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలను కేంద్రం ఏర్పాటు చేసిందని.. ఆ 157 కాలేజీల్లో తెలంగాణకు ఒక్కటి ఇవ్వలేని ఫైర్ అయ్యారు.

రాష్ట్రానికి ఒక్క విద్యా సంస్థను కూడా ఇవ్వని బీజేపీకి ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. రాష్ట్రంలోని వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలని ప్రధాని మోడీ నన్ను బెదిరించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయినప్పటికీ మోడీ బెదిరింపులకు తలొగ్గలేదన్నారు. రాష్ట్రానికి ఇవ్వాల్సిన ఐటీఐఆర్ ప్రాజెక్టును మోడీ ప్రభుత్వం రద్దు చేసిందని కేసీఆర్ గుర్తు చేశారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి నిత్యావసరాల ధరలు పెరిగేలా చేశారని బీజేపీపై నిప్పులు చెరిగారు. 

Read More...

1.30 లక్షల మందితో ధర్నా చేస్తాం.. కాంగ్రెస్ సర్కార్ KCR వార్నింగ్ 

Tags:    

Similar News