BREAKING: కాంగ్రెస్ సర్కార్‌పై మాజీ సీఎం కేసీఆర్ ఫైర్

కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ విరుచుకుపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో చేవేళ్లలో బీఆర్ఎస్ శనివారం భారీ

Update: 2024-04-13 13:42 GMT

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ విరుచుకుపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో చేవేళ్లలో బీఆర్ఎస్ శనివారం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. చాలా ఏళ్ల పోరాటం తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించాం.. హైదరాబాద్‌ను ఎంతగానో అభివృద్ధి చేశాం.. కానీ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలకే కాంగ్రెస్ ప్రభుత్వం కుదేలు అయ్యిందని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అమలు చేయలేదని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ వచ్చాక అన్నీ మాయం అయ్యాయని.. పదేళ్ల కిందటి సమస్యలు రాష్ట్రంలో మళ్లీ కనిపిస్తున్నాయన్నారు. దళితులకు రూ.12 లక్షలు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.. అధికారంలోకి వచ్చాక దళిత బంధు పథకాన్ని రద్దు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలను ఎక్కడిక్కకడ నిలదీయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ప్రజలు మౌనంగా ఉండకుండా పోరాడి సాధించుకోవాలని సూచించారు.


Similar News