గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. 9 మంది విద్యార్థుల పరిస్థితి విషమం

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల లోని ఓ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది.

Update: 2024-08-07 09:26 GMT

దిశ, వెబ్ డెస్క్: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల లోని ఓ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది. మధ్యాహ్న భోజనం తర్వాత ఈ ఘటన చోటు చేసుకోగా మొత్తం 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఇందులో కలుషిత ఆహారం తిన్న 9 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సమాచారం అందుకున్న అధికారులు విద్యార్థులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయిందనన్న విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రి వద్దకు పరుగులు తీశారు.


Similar News