Floods 2024: వరద బాధితులకు సాఫ్ట్ వేర్ ఉద్యోగుల భారీ సాయం

వరద బాధితులకు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు భారీ విరాళాన్ని అందజేశారు.

Update: 2024-09-08 09:30 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: వరద బాధితులకు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు భారీ విరాళాన్ని అందజేశారు. రూ.3 కోట్లతో నిత్యావసర సరుకుల కిట్లు అందజేశారు. ఖమ్మం వరద బాధితులకు సహయం చేసేందుకు సినీ, రాజకీయ, వ్యాపార వేత్తలతో పాటు పలువురు ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లోని సాఫ్ట్ వేర్ ఉద్యోగులు కూడా తమ వంతు సాయం చేశారు. మున్నేరు వరద బాధితుల సాహాయార్ధం హైదరాబాద్ సాఫ్ట్ వేర్ ఎంటర్ ప్రైజెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల కిట్లను అందజేశారు. రూ.3 కోట్లతో 10 వేల నిత్యావసర సరుకుల కిట్లు పంపిణీ చేయనున్నారు.

దీనికి సంబంధించిన వాహనాన్ని డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు సహా పలువురు అధికారులు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హైసీ ప్రెసిడెంట్ ప్రశాంత్ నందెళ్లతో పాటు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ వాహనం హైదరాబాద్ నుంచి ఖమ్మం జిల్లాలోని మున్నేరు వరద బాధితులు ఉన్న పునరావాస కేంద్రాలను వెళ్లనున్నట్లు తెలుస్తోంది.  


Similar News