కాజీపేట రైల్వే జంక్షన్‌లో ట్రాక్‌పై పోటెత్తిన వరద నీరు.. పలు రైళ్లు రద్దు
భారీగా కురుస్తున్న వర్షాలు భీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లలోకి వరద నీరు చేరడంతో ప్రయాణికులు ఇబ్బందిపడుతున్నారు.
దిశ, వెబ్ డెస్క్: భారీగా కురుస్తున్న వర్షాలు భీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లలోకి వరద నీరు చేరడంతో ప్రయాణికులు ఇబ్బందిపడుతున్నారు. తాజాగా కాజీపేట రైల్వే జంక్షన్‌లో ట్రాక్‌పై వరద నీరు పోటెత్తింద. దీంతో ఈ రూట్‌లో కొన్ని రైళ్లను రైల్వే శాఖ తాత్కాలికంగా నిలిపివేసింది. మూడు రైళ్లను పూర్తిగా, నాలుగు రైళ్లను పాక్షికంగా రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.. 11 రైళ్లను దారి మళ్లించినట్లు ప్రకటించినట్లు స్పష్టం చేసింది.
రద్దయిన రైళ్లు
సిర్ పూర్ కాగజ్ నగర్-సికింద్రాబాద్ - 17012
సికింద్రాబాద్ - సిర్ పూర్ కాగజ్ నగర్ - 17233
సిర్ పూర్ కాగజ్ నగర్ - సికింద్రాబాద్ - 17234
పాక్షికంగా రద్దయిన రైళ్లు
తిరుపతి - కరీంనగర్ - 12761
కరీంనగర్ - తిరుపతి - 12762
సికింద్రాబాద్ -సిర్ పూర్ కాగజ్ నగర్ - 12757
సిర్పూర్ కాగజ్ నగర్ - సికింద్రాబాద్ -12758
కాజీపేట రైల్వే జంక్షన్‌లో ట్రాక్‌పై పోటెత్తిన వరద నీరు. ఈ రూట్‌లో కొన్ని రైళ్లు తాత్కాలికంగా నిలిపివేసిన కేంద్ర రైల్వే శాఖ.
— Telugu Scribe (@TeluguScribe) July 27, 2023
మూడు రైళ్లను పూర్తిగా, నాలుగు రైళ్లను పాక్షికంగా రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే. 11 రైళ్లను దారి మళ్లించినట్లు ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే.
రద్దయిన… pic.twitter.com/iboDZVqJI7