దండకారుణ్యంలో కాల్పుల మోత.. మావోయిస్ట్‌లు, పోలీసుల మధ్య ఫైరింగ్
సుక్మా జిల్లా సక్లెర్ ప్రాంతంలో గురువారం ఉదయం పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.
దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో: సుక్మా జిల్లా సక్లెర్ ప్రాంతంలో గురువారం ఉదయం పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. కోబ్రా 208, ఎస్టీఎఫ్ బలగాలు కూంబింగ్ జరుపుతుండగా మావోయిస్టులు వారిపై దాడి చేసారు. ప్రతిగా పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. దీంట్లో అయిదుగురికి పైగా మావోయిస్టులు గాయపడ్డారని పోలీస్ అధికారి సునీల్ శర్మ తెలిపారు. గాయపడ్డ వారిని తోటి మావోయిస్టులు వెంట తీసుకొని పారి పోవటాన్ని బలగాలు గుర్తించినట్టు చెప్పారు. పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు.