Fire Accident : ప్యారడైజ్ హోటల్లో అగ్నిప్రమాదం.. ఒకరికి అస్వస్థత

సికింద్రాబాద్ ప్యారడైజ్ హోటల్లో శుక్రవారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా హోటల్ సెల్లార్ నుంచి పెద్ద ఎత్తున మంటలు చేలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురై పరుగులు తీశారు.

Update: 2024-08-23 13:37 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: సికింద్రాబాద్ ప్యారడైజ్ హోటల్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా సెల్లార్ నుంచి పెద్ద ఎత్తున మంటలు చేలరేగడంతో కస్టమర్లు, పక్కన షాపుల్లో ఉన్నవారు భయాందోళనకు గురై పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటనాస్థలానికి చేరుకుని హోటల్‌లో ఉన్న వారిని సురక్షితంగా బయటకు పంపించి మంటలను అదుపులోకి తెచ్చారు.

ఈ ఘటనలో ఒకరు అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తరలించారు. జనరేటర్ కాలిపోవడంతో పొగలు వ్యాపించి మంటలు చెలరేగాయని హోటల్ యాజమాన్యం చెబుతోంది.


Similar News