‘జిస్మత్ జైల్ మండి’ రెస్టారెంట్ ప్రారంభించిన హనీ రోస్

భోజన ప్రియులుకు నోరూరించే వంటకాల రుచులను ఆతిథ్యం అందించేందుకు మదీనగూడలోని శ్రీ దుర్గా కాలనీ ప్రధాన రోడ్డులోని ఏకేఎం ధర్మరావు సిగ్నేచర్‌లో ఏర్పాటైన "జిస్మత్ జైల్ మండి అండ్ థీమ్ రెస్టారెంట్"ను శుక్రవారం సినీ నటి హనీ రోస్ ప్రారంభించారు.

Update: 2023-03-24 16:32 GMT
‘జిస్మత్ జైల్ మండి’ రెస్టారెంట్ ప్రారంభించిన హనీ రోస్
  • whatsapp icon

దిశ, తెలంగాణ బ్యూరో: భోజన ప్రియులుకు నోరూరించే వంటకాల రుచులను ఆతిథ్యం అందించేందుకు మదీనగూడలోని శ్రీ దుర్గా కాలనీ ప్రధాన రోడ్డులోని ఏకేఎం ధర్మరావు సిగ్నేచర్‌లో ఏర్పాటైన "జిస్మత్ జైల్ మండి అండ్ థీమ్ రెస్టారెంట్"ను శుక్రవారం సినీ నటి హనీ రోస్ ప్రారంభించారు. ఈ సందర్భంలో నటి హనీ రోస్ మాట్లాడుతూ.. విభిన్న ఆహార రుచులకు హైదరాబాద్ కేరాఫ్‌గా నిలుస్తుందన్నారు. భోజన ప్రియులకు విభిన్న రకాల వంటకాల రుచులను అందించేందుకు, జైల్, నవాబ్ థీమ్ ఇక్కడ ఎంతో విభిన్నంగా ఉందన్నారు.

ఈ సందర్భంగా జిస్మత్ మండి నిర్వాహకులు, ప్రముఖ యూట్యూబర్ గౌతమి మాట్లాడుతూ.. ఈ మండిలో జైల్, నవాబ్ డిజైన్ థీమ్ ప్రత్యేకమని, ఖైదీల వేషదారణలో కారాగారం డైనింగ్‌లో కూర్చునే ఆహార ప్రియులకు ఫుడ్ సర్వ్ చేస్తారన్నారు. విజయవాడ, గుంటూరు, వైజాగ్, నెల్లూరులో బ్రాంచీలు కలిగిన తమ జిస్మత్ మండి త్వరలో సన్ సిటీలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రాంఛైజీ నిర్వహకులు దినేష్ మాట్లాడుతూ నవాబ్, జైల్ థీమ్ తో ఏర్పాటైన ఈ మండి రెస్టారెంట్‌లో చెఫ్‌లు ప్రత్యేకమైన జూసి మటన్ మండి, అల్ఫాహం మండి, అరబిక్ ఫిష్ వంటి అనేక రకాల వంటకాలను అందిస్తున్నామని వివరించారు. టాలీవుడ్ నటుడు ధర్మా, శ్రీని ఇన్‌ఫ్రా ఎండీ శ్రీను తదితరులు పాల్గొన్నారు.









 


 


 


Tags:    

Similar News