రాష్ట్రంలోని ఖాళీలు అన్ని భర్తీ చేస్తున్నాం: MLC కవిత

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేస్తున్నామని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు.

Update: 2023-02-08 14:47 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేస్తున్నామని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. శాసనమండలిలో బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో ఆమె మాట్లాడారు. తెలంగాణ వచ్చాక అనేక రంగాలు, సంక్షేమంలో ముందుకెళ్తోందన్నారు. చాలా మంది ఉద్యోగాల భర్తీ పైన మాట్లాడుతున్నారు.. ఎక్కడ ఇచ్చారో చెప్పాలని అంటున్నారు.. భర్తీ చేసిన ఉద్యోగాలు మొత్తం లెక్కలతో సహా చూపిస్తామని స్పష్టం చేశారు. పుట్టిన బిడ్డలు ఎలా చదువుతారో, ఏం జాబ్ చేస్తారు అనే భయం ఉంటుందని కానీ తెలంగాణలో అది అక్కర్లేదన్నారు. సీఎం కేసీఆర్ దృష్టి పెట్టి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌లు ఇస్తున్నారన్నారు. అంతేకాదు ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇస్తోన్న రాష్ట్రం తెలంగాణ అన్నారు. కేంద్రంలో 10 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని, కానీ ఒక్క స్థానంను భర్తీ చేయటం లేదన్నారు.

ఇస్తే కనీసం రెండు లక్షల ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలు సాధిస్తారని, దీనిపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నోరుమెదపరని అన్నారు. ఎక్కడ మాట్లాడాల్సిన మాటలు అక్కడ మాట్లాడాలని సూచించారు. తెలంగాణ వచ్చాక వయస్సు విషయంలో రెండు విడుతలుగా 5 ఏళ్ల రిలాక్సేషన్ ఇచ్చామని, లాంగ్ జంప్, షార్ట్ పుట్‌లో కొన్ని సంస్థలు, ప్రతి పక్షాలు అభ్యర్థులను రోడ్డు మీదకు తీసుకొచ్చి ఆందోళనలు చేయిస్తున్నారని మండిపడ్డారు. పోలీసు కానిస్టేబుల్ రిక్రూట్ మెంట్‌లో ప్రభుత్వం పారదర్శకంగా ముందు కెళ్తోందని, కావాలని పిల్లల్ని రెచ్చగొడుతూ ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయన్నారు. పరిశ్రమల్లో 17 లక్షల ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకు లభించాయన్నారు.

Also Read..

MLC Kavitha: ప్రధాని మోడీ, అదానీ ఒకే నాణేనికి రెండు వైపులా ఉన్న బొమ్మలు 

Tags:    

Similar News