ఇష్టానుసారంగా ఫర్టిలైజర్ దుకాణాలు
ముందు చూస్తే నుయ్యి.. వెనుక చూస్తే గొయ్యి అనే పరిస్థితుల్లో ఉన్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు.
దిశ, నారాయణఖేడ్: ముందు చూస్తే నుయ్యి.. వెనుక చూస్తే గొయ్యి అనే పరిస్థితుల్లో ఉన్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఎరువులపై నిలువు దోపిడీ, అధిక ధరల వలన ఫర్టిలైజర్ షాపుల ఆగడాలను భరించలేకపోతున్నామని రైతులు కన్నీటి పర్వతంగా విలపిస్తున్నారు. భారతదేశంలో అధిక శాతం జనాభా వ్యవసాయ రంగంపై ఆధారపడే జీవిస్తున్నారు. రైతే రాజు అని పిలువబడే భారతదేశంలో ఎక్కువ శాతం నిరక్షరాశ్యులు ఉన్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో రైతులు వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. నిస్వార్థంగా భూమిని నమ్ముకొని చమటను ధారపోసి పంటలు పండించి అన్నం పెడుతున్న రైతులకు ఎవరైనా రుణపడి ఉండాల్సిందే కానీ దానికి విరుద్ధంగా ఫర్టిలైజర్ షాపు యజమాన్యాలు మాత్రం రైతుల నడ్డి విరుస్తున్నారు. ఫర్టిలైజర్ షాపు యజమానులు తమ స్వలాభం కోసం రైతుల జీవితాల్లో చెలగాటమాడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సొమ్ము ఒకరిది సోకొకరిది అన్నట్టుగా లైసెన్సులు ఒక్కడిది లాభాలు మరొకరిది. నారాయణఖేడ్ డివిజన్‌లోని అన్ని మండలాల్లో కొన్ని వందల ఫర్టిలైజర్ షాపులు నడిపిస్తున్నారు. కానీ అందులో లైసెన్స్ ఒక్కరి పేరు మీద వ్యాపారం చేసి మరొకరు. ఎటువంటి అర్హత అవగాహన అనుభవం లేకుండానే రైతులకు చీడపురుగు నివారానికై ఇవ్వల్సిన మందులు ఇవ్వకుండా తమకు ఇష్టం వచ్చినట్లు రైతులను మాయమాటలు చెప్పి అధిక లాభాల కోసం కక్కుర్తి పడి తమ షాపులో ఉన్న పెస్టిసైడ్స్ మందులను రైతులకు అంటబెట్టి రైతులకు మోసం చేస్తున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు.
కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నారాయణఖేడ్ పట్టణంతోపాటు, కల్హేరు, కంగ్టి, మనూర్, నాగలి గిద్ద, నిజాంపేట్, సిర్గాపూర్, నారాయణఖేడ్ మండలంలో పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం ఇక్కడ నివసించే ప్రజలు నిరక్షరాస్యులు కావడంతో ఫర్టిలైజర్ షాప్ లో యజమానులు ఆడిందే ఆటగా పాడిందే పాటగా రైతుల శ్రమను నిలువు దోపిడి చేస్తున్నారు. యూరియా ఒక బస్తాకి రూ.266 లకే అమ్మవలసి ఉండగా రూ. 350లకి అమ్ముతూ అదనంగా రూ.90 లు ఒక్క బస్తా పై నిలువు దోపిడీ చేస్తున్నారు. డీఏపీ రూ.370 అమ్మవలసి ఉండగా 450 వరకు అమ్ముతున్నారు. 20-20 రూ.1250 ఉండగా రూ.1350 తీసుకుంటున్నారు. గడ్డి మందు తెలంగాణ రాష్ట్రంలో నిషేధించిన ప్పటికీ కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న మండలాల్లో గడ్డి మందు రూ. 350 ఉండగా రూ.750 రూపాయలు దండుకుంటున్నారు. పొటాషియం రూ.1150 ధర ఉండగా 1500 అమ్ముతున్నారు. సత్ర 20 -20 కూడా ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. ఫర్టిలైజర్ షాపులో యజమానులు అందులో పనిచేసే వర్కర్లు ఎటువంటి అర్హత లేకున్నా చలామణి అవుతూ రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని, నారాయణఖేడ్ నియోజకవర్గం ప్రజలు ఆయా మండలాల రైతులు ఆవేదన చెందుతున్నారు.
లైసెన్స్ ప్రమాణాలను పాటించకుండా ఫర్టిలైజర్ షాపు యజమానులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారని నియోజకవర్గ ప్రజలు ఆవేదనను వ్యక్తం చేశారు. లైసెన్స్ ప్రమాణాలను పట్టించుకోకుండా ఫర్టిలైజర్ షాపు యజమానులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారని నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. పట్టించుకోవాల్సిన వ్యవసాయ అధికారులు కాసులకు కక్కుర్తి పడి యజమానులకు వత్తాసు పలుకుతున్నారని నియోజకవర్గంలో రైతులు మండిపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో బయో నియంత్రణలో ఉన్నప్పటికీ నియోజకవర్గంలో పూర్తిస్థాయిలో బయో విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. ఎవరైనా బయో నియంత్రణలో ఉందిగా అని అడిగితే కోర్టు ఆర్డర్ ఉందని చెప్తూ నియంత్రణలో ఉన్న బయోలను కూడా విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో అధిక శాతం రైతులు సొంత పెట్టుబడి లేక అప్పు దొరకక వెళ్తే ఫర్టిలైజర్ యజమానులు తమకు ఇష్టం వచ్చినంత ధరలు రాసుకునేవారని ఆ రైతులు ఆవేదన చెందుతున్నారు. అధిక ధరలే కాకుండా అప్పు తీసుకున్నప్పటి నుంచి అదనంగా వడ్డీ చేసి రైతులు నడ్డి విరుస్తున్నారని రైతులు ఆవేదన వెళ్లబచ్చుకుంటున్నారు. ఏడీఏ, ఏవో అధికారులు కాసులకు కక్కుర్తి పడి ఫర్టిలైజర్ పై చర్యలు తీసుకున్న రోజులు లేవని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కింది స్థాయి అధికారులు ,ఏఈఓలు విధులకు హాజరు కాకపోవడంతో ఏఈఓల పరిస్థితి మరింత భిన్నంగా ఉండగా గ్రామాల్లో అవగాహనతో పాటు అందుబాటులో ఉండరని, రైతులు ఆరోపిస్తున్నారు.
రైతులు అధికారులకు సమాధానం కోసం ఫోన్ చేస్తే స్పందించరని అన్నారు. ఫర్టిలైజర్, ఫెస్టిసైడ్ యజమానులు రైతుల శ్రమను దోచుకుంటూ రైతులను అప్పుల ఉబ్బిలో పడేస్తున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఫర్టిలైజర్ షాపులో పుట్టగొడుగుల వెలిశాయని వాటిపై నియంత్రణ లేకపోవడం ఎంత విచారకరమని రైతులు అంటున్నారు.
ఎవరైనా అధికారులు విధుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకుంటా నారాయణఖేడ్ ఏడీఏ నూతన్ కుమార్
నారాయణఖేడ్ డివిజన్ అధికారులు విధుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకుంటామని జిల్లా అధికారులకు తెలియజేస్తామన్నారు. ఆన్ లైన్ లో ఉండటంతో తప్పని పరిస్థితుల్లో అందరూ డ్యూటీ చేయాలని, సొంత అవసరాల కోసం వెళితే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.వివరణ కోసం సంగారెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి నరసింహారావుకు ఫోన్ చేస్తే స్పందించలేదని తెలిపారు.