IAS daughter : ట్రైనీ ఐఏఎస్‌గా పోలీస్ అకాడమీకి కూతురు.. సెల్యూట్ చేసిన ఎస్పీ ర్యాంక్ తండ్రి
అత్యంత అరుదైన ఘటన అంటూ తాజాగా నెట్టింట కొన్ని ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రానికి చెందిన నూకల ఉమా హారతి యూపీఎస్సీ సివిల్స్-2022 పరీక్షల్లో జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు సాధించిన విషయం తెలిసిందే.
దిశ, డైనమిక్ బ్యూరో: అత్యంత అరుదైన ఘటన అంటూ తాజాగా నెట్టింట కొన్ని ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రానికి చెందిన నూకల ఉమా హారతి యూపీఎస్సీ సివిల్స్-2022 పరీక్షల్లో జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు సాధించిన విషయం తెలిసిందే. ఆమె తండ్రి ఆఫీసర్ వెంకటేశ్వర్లు గతంలో నారాయణపేట జిల్లా ఎస్పీగా పని చేశారు. ప్రస్తుతం తెలంగాణ పోలీస్ అకాడమీలో విధులు నిర్వహిస్తున్నారు. కూతురు ఉమాహరతి ట్రైనీ ఐఏఎస్‌గా తెలంగాణ పోలీస్ అకాడమీకి వచ్చారు. అక్కడ తన కుమార్తెను చూసి ఎస్పీ ర్యాంకు అధికారి అయిన వెంకటేశ్వర్లు సెల్యూట్ చేశారు. తర్వాత కుమార్తెకు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. దీంతో తండ్రి కూతురికి సెల్యూట్ చేసే దృశ్యం అందరిని కదిలించింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయితే, ఆమె విజయం.. ఆ కన్నతండ్రికి గర్వకారణమైందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా, శనివారం ఏడుగురు ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారులు ప్రాక్టికల్ ట్రెయినింగ్ కోసం అకాడమీకి వచ్చారు. వారికి అకాడమీ డైరెక్టర్ అభిలాష బిష్త్‌కు బదులుగా.. జాయింట్ డైరెక్టర్ డీ మురళీధర్, డిప్యూటీ డైరెక్టర్ వేంకటేశ్వర్లు స్వాగతం పలికారు. అనంతరం అకాడమీ మరో డిప్యూటీ డైరెక్టర్ సీ నర్మద ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారులకు బ్రీఫ్ ప్రజంటేషన్ ఇచ్చారు.