అయ్య ఔరంగాబాద్‌లో.. కొడుకు ప్లీనరీలో..: రేవంత్ రెడ్డి
"అయ్యా ఔరంగాబాద్‌లో... కొడుకు ప్లీనరీ సమావేశాలు "అంటూ తిరుగుతుంటే రైతులను ఎవరు ఆదుకోవాలని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు.
దిశ, తెలంగాణ బ్యూరో: "అయ్యా ఔరంగాబాద్‌లో... కొడుకు ఆత్మీయ ప్లీనరీ సమావేశాలు "అంటూ తిరుగుతుంటే రైతులను ఎవరు ఆదుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లను ఉద్దేశించి అన్నారు. అకాల వర్షాలతో కల్లాల్లో ధాన్యం తడిసి రైతులు కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంటే ప్రభుత్వానికి పట్టింపు లేదన్నారు. ఆత్మీయ సమ్మేళనాలు, దేశ రాజకీయాల పేరిట కార్యక్రమాలు చేసుకుంటూ స్థానికంగా ఉండే రైతులను సర్కార్ నిర్లక్ష్యం చేస్తుందన్నారు. పంట కొనుగోలు సంక్రమంగా జరగకపోవడం వల్లే అకాల వర్షాలకు రైతులకు నష్టం చేకూర్చిందన్నారు. రైతుల కన్నీళ్ళకు బాధ్యులు ఎవరు? వీళ్లకు మానవత్వం ఉందా? ఇది ప్రభుత్వమేనా..? అంటూ రేవంత్ ఫైర్ అయ్యారు. రైతు-యువత ఏకమై బీఆర్ఎస్‌ను బొందపెట్టే సమయం వస్తుందని ట్విట్టర్ వేదికగా హెచ్చరించారు.
Read More: రాష్ట్రంలో అకాల వర్షాలు.. ఎమ్మెల్యేలకు కేటీఆర్ కీలక ఆదేశాలు