రైతు రుణ మాఫీ కాంగ్రెస్ పార్టీ​ విజయం: TPCC Chief Revanth Reddy

కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలు, పోరాటాలు, ఒత్తిడి ఫలితంగానే కేసీఆర్ రుణమాఫీ ప్రకటించారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Update: 2023-08-02 14:48 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలు, పోరాటాలు, ఒత్తిడి ఫలితంగానే కేసీఆర్ రుణమాఫీ ప్రకటించారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల బృందం రాష్ట్ర చీఫ్ సెక్రటరీని కలిసి రుణ మాఫీ గురించి డిమాండ్ చేసిందని, రుణ మాఫీ అమలు చేయకపోతే బ్యాంక్‌ల ముందు ధర్నాలు చేస్తామని హెచ్చరించినట్లు రేవంత్ గుర్తు చేశారు. దీంతో ఆందోళనకు గురైన కేసీఆర్ వెంటనే రుణమాఫీ చేస్తామన్నారు. కేసీఆర్ అసమర్థత వల్ల రుణమాఫీ 4 సంవత్సరాలు ఆలస్యం అయిందని, దీంతో వడ్డీలతో సహా చెల్లించాలన్నారు. రైతులకు పూర్తి స్థాయిలో రుణ మాఫీ అందే వరకు కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉండి పోరాటం చేస్తుందన్నారు.

Tags:    

Similar News