Maoist banners : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టుల బ్యానర్లు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem district)లో మావోయిస్టుల బ్యానర్లు(Maoist banners)కలకలం రేపాయి.

Update: 2024-11-30 07:38 GMT

దిశ, వెబ్ డెస్క్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem district)లో మావోయిస్టుల బ్యానర్లు(Maoist banners)కలకలం రేపాయి. మావోయిస్టు పార్టీ డిసెంబర్ 2 నుండి 8వ తేదీ వరకు తలపెట్టిన పీఎల్ జీఏ వారోత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిస్తు బ్యానర్లు ప్రదర్శించారు. చర్ల మండలం పూసుగుప్ప వద్దిపాడు ప్రధాన రహదారి రొట్టెంత వాగు సమీపంలో ఆజాద్ పేరుతో ఈ బ్యానర్లు వెలిశాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కరకగూడెం మండలం రఘునాథపాలెం అటవీ ప్రాంతంలో గత సెప్టెంబర్ మొదటి వారంలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌ లో లచ్చన్న దళానికి ఆరుగురు మావోయిస్టులు హతమయ్యారు. ఎన్ కౌంటర్ తర్వాత గత ఆక్టోబర్ లో ఈ జిల్లాలో ఆపరేషన్ కగార్ కు వ్యతిరేకంగాను, మావోయిస్టు పార్టీ 20వ వార్షికోత్సవాలు జయప్రదం చేయాలని బ్యానర్లు ప్రదర్శించారు. తాజాగా పీఎల్ జీఏ వారోత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిస్తు బ్యానర్లు ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో పోలీసు బలగాలు ఏజెన్సీ ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్లను మరోసారి ముమ్మరం చేస్తున్నాయి. పీఎల్ జీఏ వారోత్సవాల వేళ ఉనికి కోసం, సంచనాల కోసం మావోయిస్టులు హింసాత్మక, విధ్వంసక చర్యలకు పాల్పడే అవకాశం లేకపోలేదన్న అనుమానాలతో మావోల కదలికలపై నిఘా పెంచారు.


పోలీసుల దాడులను సమర్ధంగా ఎదుర్కొనేందుకు సాయుధ బలగాన్ని పెంచుకోనే లక్ష్యంతో మావోయిస్టు పార్టీ (అప్పట్లో పీపుల్స్ వార్ గ్రూపు) 2000 సంవత్సరం డిసెంబర్ రెండో తేదీన పీపుల్స్ గెరిల్లా ఆర్మీ(పీఎల్ఏ)ను ఏర్పాటు చేసింది. సుమారు నాలుగేళ్ల తరువాత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) ఆవిర్భావం(2004 సెప్టెంబరు 21) పిదప పీపుల్స్ గెరిల్లా ఆర్మీ కాస్తా 2004 సెప్టెంబర్ 24న పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ(పీఎల్ జీఏ)గా మారింది.

Tags:    

Similar News