రేషన్ కార్డులపై తప్పుడు ప్రచారం.. స్పందించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డులు రద్దు చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం పూర్తిగా అబద్ధం అని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డులు రద్దు చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం పూర్తిగా అబద్ధం అని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. మా ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డును తొలగించలేదని స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలు కోసం ప్రజల వద్ద నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే. ఇటువంటి సమయంలో రేవంత్ రెడ్డి సర్కార్ పెద్ద ఎత్తున రేషన్ కార్డులు రద్దు చేస్తున్నట్లు ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక్క మేడ్చల్ జిల్లాలోనే 95,040 రేషన్ కార్డులు రద్దు అయ్యాయని త్వరలో మిగాతా జిల్లాలోనూ ఇదే స్థాయిలో రేషన్ కార్డులు క్యాన్సిల్ చేసే అవకాశం ఉందనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుండటంతో దీనిపై లబ్ధిదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలో ఈ వార్త నిజమేనా అంటూ ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ఉత్తమ్ కుమార్‌ను ఎక్స్ (ట్విట్టర్) వేదికగా క్లారిటీ కోరారు. దీనిపై స్పందించిన పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. రేషన్ కార్డుల రద్దు వార్త పూర్తిగా అబద్దం అని కొట్టిపారేశారు. అయితే ఈ ప్రచారం చేస్తున్న ట్విట్టర్ ఖాతాపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఇంలాటి తప్పుడు వార్తలతో ప్రజలను మోసం చేసే వారితో జాగ్రత్తగా ఉండాలని అప్రమత్తం చేసింది. కేటీఆర్‌కు ప్రజల పట్ల బాధ్యత ఉంటే ఈ ఫేక్ న్యూస్‌ని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి ప్రజలను చైతన్య పరచాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
Sir @UttamINC is this true ? https://t.co/yOxlAOOBv9
— Asaduddin Owaisi (@asadowaisi) January 4, 2024
❌❌Fake News Alert❌❌❌
— Sama Ram Mohan Reddy (@RamMohanINC) January 4, 2024
ఇలాంటి తప్పుడు వార్తలతో ప్రజలను మోసం చేసేవారితో తస్మాత్ జాగ్రత్త..
ఈ ఫేక్ న్యూస్ పెడ్లర్స్ కి ప్రజలని మోసం చెయ్యడమే లక్ష్యం..
కేటీఆర్ కి ప్రజలపట్ల బాధ్యత ఉంటే ఈ ఫేక్ న్యూస్ ని తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసి ప్రజలను చైతన్య పరచాలి. లేదంటే చేపించిన వాడు… pic.twitter.com/NxTxXgWacU