ఎక్స్‌ట్రా పెరుగు ఎఫెక్ట్.. మెరిడియన్ రెస్టారెంట్‌కు షాక్!

ఎక్స్‌ట్రా పెరుగు అడిగినందుకు హోటల్ సిబ్బంది విచక్షణ రహితంగా దాడికి పాల్పడిన ఘటనలో కస్టమర్ మృతి చెందిన విషయం తెలిసిందే.

Update: 2023-09-12 07:02 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ పంజాగుట్టలోని మెరిడియన్ రెస్టారెంట్ లో సోమవారం బిర్యాని తినడానికి వచ్చిన కస్టమర్ ఎక్స్‌ట్రా పెరుగు అడిగినందుకు హోటల్ సిబ్బంది విచక్షణ రహితంగా దాడికి పాల్పడిన ఘటనలో కస్టమర్ మృతి చెందిన విషయం తెలిసిందే. పోలీసుల ముందే ఆ కస్టమర్‌ను హోటల్ సిబ్బంది దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. మరోవైపు ఈ వ్యవహారం అంత సోషల్ మీడియాలో వైరల్‌గా కూడా మారింది. దీంతో ఘటనపై సీరియస్ అయిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్.. ఆ మెరిడియన్ రెస్టారెంట్ తాత్కాలికంగా మూసివేతకు ఆదేశాలు ఇచ్చారు. మరోవైపు తమ ముందే దాడి చేస్తున్న నిర్లక్ష్యం వహించిన పంజాగుట్ట సబ్ ఇన్స్‌పెక్టర్, శివ శంకర్, హెడ్ కానిస్టేబుల్ రమేశ్‌లను సస్పెండ్ చూస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.


Tags:    

Similar News

టైగర్స్ @ 42..