టీ కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు.. నేడు మరోసారి సమావేశం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ దృష్టి సారించింది

Update: 2023-09-21 06:20 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ దృష్టి సారించింది. అభ్యర్థులను ఖరారు చేసేందుకు వరుస సమావేశాలు నిర్వహిస్తోంది. బుధవారం అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసేందుకు కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ నిర్వహించగా.. ఇవాళ మరోసారి సమావేశం కానుంది. నిన్న రెండు గంటల పాటు మాత్రమే స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరిగింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు.

అయితే పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ ఉండటంతో ఎంపీలు సమావేశానికి హాజరయ్యారు. దీంతో రెండు గంటల పాటు మాత్రమే నిన్న స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఇవాళ ఏఐసీసీ కార్యాలయంలో మరోసారి స్క్రీనింగ్ కమిటీ భేటీ కానుంది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే కూడా ఈ సమావేశంలో పాల్గొనన్నారు. టీపీసీసీ పొలిటికల్ అపైర్స్ కమిటీ సూచించిన జాబితాను స్క్రీనింగ్ కమిటీ పరిశీలించి అభ్యర్థులను ఖరారు చేయనుంది. అభ్యర్థుల జాబితాను సిద్దం చేసిన తర్వాత పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి జాబితా పంపనుంది.

కేంద్ర ఎన్నికల కమిటీ జాబితాను పరిశీలించి అధిష్టానానికి పంపనుంది. అనంతరం హైకమాండ్ అభ్యర్థులను ఫైనల్ చేయనుంది. వివిధ సర్వే రిపోర్టులు, నియోజకవర్గాల్లోని స్థానిక పరిస్థితులు, సామాజిక సమీకరణాలను అంచనా వేసి అభ్యర్థులకు సీట్లను కేటాయించనున్నారు. ఈ నెలాఖరు కల్లా తొలి జాబితాను సిద్దం చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. దసరా కల్లా 119 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఫైనల్ చేయనుందని తెలుస్తోంది.

Tags:    

Similar News