‘CM పదవి కోసం హరీష్ రావు రూ.5 వేల కోట్లు సిద్ధం చేసుకున్నాడు’

బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. శనివారం ఆయన జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. హరీష్ రావు, కేటీఆర్ పెద్ద డ్రామా ఆర్టిస్ట్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-02-10 14:18 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. శనివారం ఆయన జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. హరీష్ రావు, కేటీఆర్ పెద్ద డ్రామా ఆర్టిస్ట్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రివ్యూలు చేస్తుంటే హరీష్ రావుకు నిద్ర పట్టడం లేదని ఎద్దేవా చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు హరీష్ రావు సీఎం పదవి కోసం రూ.5 వేల కోట్లు సిద్ధం చేసి పెట్టుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. డబ్బు ఎక్కడ దాచిపెట్టారో వెలికి తీయాలని సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాస్తా అని కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక్కరిని కూడా వదిలి పెట్టబోమని.. బీఆర్ఎస్ హయాంలో అవినీతికి పాల్పడిన అందరి భాగోతం బయట పెడుతామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.


అధికారాన్ని అడ్డం పెట్టుకొని గతంలో హరీష్ రావు, కేటీఆర్, కవిత, సంతోష్ రావులు వేల కోట్లు దండుకొని దాచిపెట్టుకున్నారని కీలక ఆరోపణలు చేశారు. బాల్క సుమన్‌కి తెలివి లేదని సీరయస్ అయ్యారు. మరోసారి సుమన్ మాట్లాడితే డైరెక్ట్‌గా వెళ్లి కొడతామని హెచ్చరించారు. తిట్ల పురాణానికి కేసీఆర్ గురువు అయితే.. కాంగ్రెస్ వాళ్లు కేసీఆర్‌కే గురువులు అని చెప్పారు. కాగా, అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, కేటీఆర్‌లు సీరియస్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసిందని బడ్జెట్‌లో తెలిసిపోయిందని తీవ్ర వ్యాఖ్యల చేశారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..