ప్రేమోన్మాది ఘాతుకం.. బాధిత కుటుంబానికి కేటీఆర్ భరోసా

ప్రేమోన్మాది దాడిలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు మాజీ మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. వారం రోజుల క్రితం నర్సంపేట నియోజకవర్గంలోని 16 చింతల తాండ గ్రామంలో ప్రేమోన్మాది చేతిలో గిరిజన దంపతులు దారుణ హత్యకు గురయ్యారు.

Update: 2024-07-16 12:02 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రేమోన్మాది దాడిలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు మాజీ మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. వారం రోజుల క్రితం నర్సంపేట నియోజకవర్గంలోని 16 చింతల తాండ గ్రామంలో ప్రేమోన్మాది చేతిలో గిరిజన దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. ఈ దాడిలో దంపతుల ఇద్దరు పిల్లలు కూడా తీవ్రంగా గాయపడ్డారు.. చికిత్స అనంతరం తాజాగా వారు కోలుకున్నారు. ఈ క్రమంలోనే చనిపోయిన దంపతుల పిల్లలిద్దరినీ మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డితో కలిసి మంగళవారం కేటీఆర్ కలిశారు. ఈ సందర్భంగా వారితో కేటీఆర్ మాట్లాడారు. ధైర్యంగా ఉండాలని, అండగా ఉంటానని వారికి భరోసా ఇచ్చారు.

కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయంతో పాటు ఇద్దరు పిల్లల చదువులకు అయ్యే పూర్తి ఖర్చును తానే చూసుకుంటానని కేటీఆర్ హామీ ఇచ్చారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం రూ.50 లక్షలు వారికి ఆర్థిక సాయం అందించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. దాడి చేసి పిల్లల తల్లిదండ్రుల హత్యకు కారణమైన నిందితున్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.


Similar News