వాళ్లే మాపై దౌర్జన్యం చేశారు.. జీహెచ్ఎంసీ కౌన్సిల్‌లో ఘర్షణపై ఎంపీ ఈటల రియాక్షన్

బీజేపీ, ఎంఐఎం కార్పొరేటర్ల ఘర్షణపై ఎంపీ ఈటల రియాక్ట్ అయ్యారు.

Update: 2024-07-06 10:39 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఎంఐఎం, బీజేపీ కార్పొరేటర్ల మధ్య చోటుచేసుకున్న ఘర్షణపై మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ రియాక్ట్ అయ్యారు. ప్రజా సమస్యలపై నిలదీస్తుంటే వాళ్లే అకారణంగా మా మహిళా కార్పొరేటర్లపై దౌర్జన్యం చేశారని ఆరోపించారు. ఇవాళ కౌన్సిల్ మీటింగ్ అనంతరం ఈటల మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వానికి రాజకీయాలు, పదవులపై ఉన్న ధ్యాస ప్రజా సమస్యల పరిష్కారంపై లేదని మండిపడ్డారు. దీనికి ఇవాళ కౌన్సిల్‌లో జరిగిన ఘటనే నిదర్శనమని చెప్పారు. గత బీఆర్ఎస్ హయాంలో జరిగినట్లుగానే ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని కాంగ్రెస్ తుంగలోకి తొక్కుతోందని విమర్శించారు. గతంలో అధికారంలో ఉన్న పార్టీ కూడా ఇదే తరహాలో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పనిచేసి ప్రజాగ్రహానికి గురైందని, కాంగ్రెస్ కూడా ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.

Tags:    

Similar News