CM రేవంత్‌కు మైండ్ ఖరాబ్ అయింది.. ఈటల ఘాటు వ్యాఖ్యలు

రేవంత్ రెడ్డి మైండ్ ఖరాబ్ అయ్యి మాట్లాడుతున్నాడని మల్కాజ్ గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు.

Update: 2024-05-07 07:06 GMT

దిశ, మేడ్చల్ బ్యూరో : రేవంత్ రెడ్డి మైండ్ ఖరాబ్ అయ్యి మాట్లాడుతున్నాడని మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. తాను బీసీలకు ఏమి చేయలేదని సీఎం రేవంత్ అనడం అవివేకమన్నారు. మంగళవారం ఉదయం ఓల్డ్ బోయిన్‌పల్లిలోని రామరాజునగర్‌లో పద్మశాలి ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. అనంతరం బాలాజీ నగర్‌లో విశ్వకర్మ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఈటల రాజేందర్ మాట్లాడుతూ... ఒక్క బీసీల కోసమే 250 రెసిడెన్షియల్ స్కూల్స్‌కు జీవో ఇచ్చిన వ్యక్తిని తానేన్నారు. సంచార జాతి పిల్లలకు ఎంట్రన్స్ ఎగ్జామ్ లేకుండా స్కూల్స్‌లో అడ్మిషన్ ఇచ్చింది కూడా తానే అన్నారు. 360 రోజులు అణగారిన వర్గాల పిల్లల కోసం తాను సేవ చేసినట్లు చెప్పారు.

తెలంగాణలో అన్ని హాస్టళ్లలోకి, అన్ని ప్రభుత్వ స్కూళ్ళకి అందరికీ సన్న బియ్యం, కడుపునిండా అన్నం పెట్టే జీవో ఇచ్చింది కూడా తానేనన్నారు. ఈటల రాజేందర్ అనేటోడికి అధికారం వస్తే ఎవరికి చెప్పకుండా, నేను ఎక్కడి నుంచి వచ్చానో నాకు అర్థం అయింది కాబట్టి, 40 రోజులపాటు మా వాళ్లను అసెంబ్లీకి పిలిపించి, నేనే భోజనాలు పెట్టించిన విషయాన్ని గుర్తు చేశారు. వందకు పైగా కులాలను ఆదుకుంటేనే రేపు భవిష్యత్తు అని, ఈ జాతులను ప్రభుత్వాన్ని లింక్అప్ చేసిన బిడ్డను నేనని తెలిపారు. కరోనా వచ్చిన నాడు, మొట్టమొదటి కరోనా పేషెంట్ దగ్గరకు పోయి.. బిడ్డ నిన్ను బతికించుకునే బాధ్యత నాది, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పినట్లు ఈటల గుర్తుచేశారు. దేశంలో నిరుపేదలకు అండగా ఉన్నది బిజెపి అని, ఉండబోయేది కూడా బిజెపి నేనని స్పష్టంచేశారు.

బాలాజీనగర్ మూలానికి టైగర్ కారణం..

బాలాజీ నగర్ కాలనీ మూలానికి ప్రధాన కారకుడు టైగర్ నరేంద్ర అని తెలిపారు. తాను ఆర్థిక మంత్రిగా పనిచేసినప్పుడు కొన్ని వందల మంది నా దగ్గరకు వచ్చేవారన్నారు. ఆ ఛాంబర్ చెమట వాసన వచ్చేదని తెలిపారు. మా డిపార్ట్మెంట్లో ఒకరు వచ్చి ఇది ఫైనాన్స్ డిపార్ట్మెంట్‌నా .. లేక కూరగాయల మార్కెటా అని అన్నారని తెలిపారు. మేము ఒక సంతకం పెట్టించుకుందామంటే మాకు టైం దొరకడం లేదన్నారు. ఆరోజు నేను ఒకటే అన్నాను మా డిపార్ట్మెంట్లో చెమట వాసన వస్తుందని నువ్వు చెప్పినందుకు గర్వపడుతున్నాను. ఇది పేదలకు ఒక అడ్డా.. పేదలకు ఒక భరోసా కేంద్రమని సంతోష పడ్డానని ఈటల తెలిపారు. తనను ఎంపీగా గెలిపిస్తే పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు వస్తాయన్నారు. సిమెంట్ రోడ్లు వేయిస్తానని చెప్పారు. డ్రైనేజీ సిస్టం వస్తాయి కాబట్టి మల్కాజ్ గిరి ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదించాలని ఈటల రాజేందర్ విజ్ఠప్తి చేశారు. రామరాజు నగర్‌లో ఏర్పాటు చేసిన బ్రెక్ ఫాస్ట్, పద్మశాలి సమ్మేళనంలో మాజీ శాసన సభ్యులు శ్రీ రాములు, డాక్టర్ పి.కిషన్, డాక్టర్ సమతా, మ్యాడం బాబురావు, స్వర్గం మల్లేశం, కోడూరి అశోక్, గెలిగేటి గోపి, టి.వి.సురేష్ , సూర్య తదితరులు పాల్గొన్నారు.


Similar News