అసెంబ్లీలో తన పేరు ప్రస్తావించడంపై స్పందించిన ఈటల
అసెంబ్లీ సమావేశాల చివరిరోజున ముఖ్యమంత్రి కేసీఆర్ పదే పదే బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పేరు ప్రస్తావించారు.
దిశ, వెబ్డెస్క్: అసెంబ్లీ సమావేశాల చివరిరోజున ముఖ్యమంత్రి కేసీఆర్ పదే పదే బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పేరు ప్రస్తావించారు. బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే రాజేందర్ పేరును ప్రస్తావించారు. తాజాగా.. కేసీఆర్ పదే పదే తన పేరు ప్రస్తావించడంపై హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు. తనను డ్యామేజ్ చేసే వ్యూహంతోనే కేసీఆర్ అలా మాట్లాడారని చెప్పారు. కాగా, అసెంబ్లీ సమావేశాల చివరిరోజున కేసీఆర్ అనూహ్య వ్యాఖ్యలు చేశారు. ఈటల రాజేందర్ విజ్ఞప్తులను తక్షణమే అమలు చేయాలని, వారి నియోజకవర్గాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని అధికారులను సీఎం ఆదేశించారు. డైట్ చార్జీల అంశంలో వెంటనే జీవో విడుదల చేయాలని సంబంధిత మంత్రికి, అధికారులకు సూచించడం విశేషం.