బ్రేకింగ్ : ఈటల రాజేందర్ అరెస్ట్
బండి సంజయ్ అరెస్ట్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఆందోళనలకు పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే.
దిశ ప్రతినిధి,మేడ్చల్: శామీర్ పేటలోని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ నివాసం వద్ద హైడ్రామా చోటుచేసుకుంది. బండి సంజయ్‌ను బొమ్మల రామారంలోని పీఎస్‌లో పరామర్శించేందుకు వెళుతున్న ఈటల రాజేందర్‌ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఈటల పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. తాను బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లుతున్నట్లు చెప్పి బయలుదేరి వెళ్లగా, పోలీసులు ఈటల కాన్వాయ్‌ను వెంబడించి హకీంపేటలో ఈటలను ఆదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీసులతో ఈటల వాగ్వివాదానికి దిగారు. తనను ఎందుకు అడ్డుకుంటున్నారని పోలీసులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. నేను బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లుతున్నానని చెప్పగా, ముందు జాగ్రత్తగా ఆరెస్టు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఈటల మీ కమీషనర్‌తో మాట్లాడనని, అక్రమంగా ఆదుపులోకి తీసుకుంటే సహించేది లేదని పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. ఈటలను బలవంతంగా ఆదుపులోకి తీసుకుని శామీర్ పేటలోని తన నివాసానికి తరలించారు.
బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఆరెస్ట్ నేపథ్యంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం సంజయ్ అరెస్టుకు వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ఆందోళనలు చేయకుండా పోలీసులు బీజేపీ నాయకులను ఎక్కడికక్కడ కట్టడి చేశారు. కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకోగా, మరికొందరిని గృహనిర్బంధం చేశారు. బీజేపీ జిల్లా రూరల్ అధ్యక్షుడు విక్రమ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి తిరుమల్ రెడ్డిలతోపాటు పలువురు మహిళ నేతలను ఆదుపులోకి తీసుకుని అదిబట్ల పీఎస్‌కు తరలించారు. కాగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావును బొమ్మల రామారంలో ఆదుపులోకి తీసుకుని శామీర్ పేట పీఎస్‌కు తరలించినట్లు సమాచారం. అయితే పోలీసులు ఠాణా లోపలికి ఎవరిని అనుమతించడంలేదు.
Read more:
బండి సంజయ్‌ను వరంగల్‌కు తరలిస్తున్న పోలీసులు...వరంగల్‌కు కేసు బదిలీ చేసే ఛాన్స్