Engineering Counselling: నేటి నుంచి రెండో విడత ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ప్రారంభం.. వెబ్ ఆప్షన్లకు ఆ తేదీలు ఖరారు

రాష్ట్ర వ్యాప్తంగా ఇంజినీరింగ్‌ 2024-25 విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం శుక్రవారం నుంచి రెండో విడత కౌన్సెలింగ్‌ ప్రారంభం కానుంది.

Update: 2024-07-26 03:51 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా ఇంజినీరింగ్‌ 2024-25 విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం శుక్రవారం నుంచి రెండో విడత కౌన్సెలింగ్‌ ప్రారంభం కానుంది. ఈ మేరకు Department of Technical Education

 కమిషనర్‌, EAPCET కన్వీనర్‌ శ్రీ దేవసేన గురువారం షెడ్యూల్‌ను విడుదల చేశారు. అయితే, విద్యార్థులు ప్రాసెసింగ్‌ ఫీజు ఆన్‌లైన్ ద్వారా చెల్లించి స్లాట్‌ బుక్‌ చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ నెల 27న సర్టిఫికేట్ల వెరిఫికేషన్ నిర్వహిస్తామని తెలిపారు. ఈ నెల 27,28 తేదీల్లో విద్యార్థులు కాళాశాల ఎంపికకు వెబ్‌ ఆప్షన్లను పెట్టుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. జూలై 31న సీట్ల కేటాయింపు ఉంటుందని, మరిన్ని వివరాలకు https://tgeapcet.nic.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని అధికారులు వెల్లడించారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..