గుండెపోటుతో ఉపాధి హామీ కూలీ మృతి
హఠాత్తుగా గుండె నొప్పి వచ్చి.. ఉపాధి పనులు చేస్తున్న కూలీ మృతి చెందాడు.
దిశ, భిక్కనూరు : హఠాత్తుగా గుండె నొప్పి వచ్చి.. ఉపాధి పనులు చేస్తున్న కూలీ మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం భిక్కనూరు మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. మండల కేంద్రానికి చెందిన అంబల్ల మల్లయ్య (72), కర్లోని కుంటలో జరుగుతున్న ఉపాధి హామీ పనులకు వెళ్లాడు. ఎప్పటిలాగే కూలీలతో కలిసి మట్టి తీస్తుండగా ఒక్కసారిగా గుండె నొప్పి రావడంతో, అక్కడే కుప్పకూలీ మృతి చెందాడు. అయితే తోటి కూలీలు స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మల్లయ్య మృతితో మండల కేంద్రంలో విషాదఛాయలు అలుముకున్నాయి.