ఎట్టకేలకు ఫలించిన మంత్రి కొండా ప్రయత్నం.. కర్నాటక నుండి తెలంగాణకు ఏనుగు తరలింపు

అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రయత్నాలు ఫలించాయి. రాష్ట్రంలో బోనాల ఉత్సవాల్లో అమ్మవారి

Update: 2024-07-10 16:55 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రయత్నాలు ఫలించాయి. రాష్ట్రంలో బోనాల ఉత్సవాల్లో అమ్మవారి అంబారీ ఊరేగింపుతో పాటు మొహర్రం పండుగ (బీబీ కా ఆలం అంబారీ ఊరేగింపు) నిమిత్తం కర్నాటక అటవీ శాఖ తెలంగాణకు ఏనుగు(రూపవతి)ను తరలించేందుకు ఎట్టకేలకు ఆమోదం తెలిపింది. కర్నాటక అటవీశాఖా మంత్రి ఈశ్వర్ ఖండ్రేతో ఈ విషయంపై మంత్రి సురేఖ పలుమార్లు చర్చించి, ఏనుగు తరలింపునకు ఆమోదం తెలిపేలా చర్యలు చేపట్టారు. దీంతో కర్ణాటక దావణగిరెలోని పాంచాచార్య మందిర ట్రస్టు నుంచి ఏనుగు తీసుకొచ్చేందుకు మార్గం సుగమమైంది. అటవీ చట్టాల అనుసరించి ఏనుగు తరలింపులో పాటించాల్సిన జాగ్రత్తలు, పర్యవేక్షణ తదితర అన్ని రకాల మార్గదర్శకాలను అనుసరించి ఏనుగును రాష్ట్రానికి తీసుకురానున్నట్లు మంత్రి తెలిపారు. ఏనుగు రాష్ట్రానికి చేరుకున్న తర్వాత ఏనుగు పోషణ, విశ్రాంతి తదితర అంశాలకు సంబంధించి అటవీ చట్టాల మార్గదర్శకాలను పాటించాల్సిందిగా అటవీ అధికారులను ఆదేశించారు.


Similar News