టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు: మొత్తం ఎంతమంది ఓటర్లు ఉన్నారంటే?

ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటర్ జాబితాను రాష్ట్ర ఎన్నికల ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ విడుదల చేశారు.

Update: 2023-02-24 11:22 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటర్ జాబితాను రాష్ట్ర ఎన్నికల ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ విడుదల చేశారు. ఈ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గం పరిధిలోని 9 జిల్లాల్లో మొత్తం 29,720 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో పురుష ఓటర్లు 15,472 మంది ఉండగా 14,246 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. థర్డ్ జెండర్ ఓటర్లు ఇద్దరు ఉన్నారు. ఈ నియోజకవర్గం పరిధిలో మొత్తం 137 పోలింగ్ స్టేషన్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం పేర్కొంది.

కీలకంగా ఆ జిల్లా ఓటర్లు:

టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లా ఓటర్లు కీలకం కాబోతున్నారు. ఈ జిల్లా నుంచి అత్యధికంగా 9,186 ఓట్లు ఉన్నాయి. ఆ తర్వాత మేడ్చల్ మల్కాజ్ గిరిలో 6,836 మంది ఓటర్లు ఉండగా హైదరాబాద్‌లో 3,949, మహబూబ్ నగర్‌లో 3,461, నాగర్ కర్నూల్‌లో 1,822, వనపర్తిలో 1,335, జోగులాంబ గద్వాల్‌లో 877, నారాయణపేటలో 664, వికారాబాద్‌లో 1,890 మంది ఓటర్లు ఉన్నారు.

Tags:    

Similar News