పంచాయతీ ఎన్నికల ఎఫెక్ట్.. BJP శ్రేణులకు కిషన్ రెడ్డి కీలక పిలుపు

అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ముగియడంతో భవిష్యత్ కార్యచరణపై తెలంగాణ బీజేపీ దృష్టి పెట్టింది. ద్విముఖ వ్యూహంతో స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతోంది.

Update: 2024-05-18 09:33 GMT

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ముగియడంతో భవిష్యత్ కార్యచరణపై తెలంగాణ బీజేపీ దృష్టి పెట్టింది. ద్విముఖ వ్యూహంతో స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే నాంపల్లిలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడు కిషన్ రెడ్డి ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఇచ్చిన గ్యారంటీలు అమలు చేసేవరకు కాంగ్రెస్ పార్టీని నిలదీస్తామని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో బీజేపీ పటిష్టంగా ఉందని అన్నారు. స్థానిక ఎన్నికల్లో కూడా సత్తా చాటాలని అన్నారు. మరోవైపు పార్లమెంట్ ఎన్నికలు ముగియడంతో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల హడావిడి మొదలైంది. ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అధికారుల నియామకానికి మార్గదర్శకాలను గతేడాది గతేడాది డిసెంబరులోనే రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. పార్లమెంట్ ఎన్నికల కారణంగా కాస్త వాయిదా పడ్డాయి. ప్రస్తుతం ఈసీ మార్గదర్శకాలకు అనుగుణంగా రిటర్నింగ్ అధికారులు, ప్రిసైడింగ్, పోలింగ్ అధికారులు, సిబ్బంది నియామకాలను చేపట్టాల్సి ఉంది. కాగా, చివరి సారి 2019 జనవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. ఫిబ్రవరి 1వ తేదీ 2024తో పాలకవర్గాల గడువు ముగిసింది.

Tags:    

Similar News