Education: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గొప్ప శుభవార్త
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం శుభవార్త చెప్పింది. తెలంగాణ(Telangana), ఏపీ(AP)లో కొత్త విద్యాలయాల(New Educational Institutions) ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.
దిశ, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం శుభవార్త చెప్పింది. తెలంగాణ(Telangana), ఏపీ(AP)లో కొత్త విద్యాలయాల(New Educational Institutions) ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో నూతన విద్యాలయాలు ఏర్పాటు చేయాలని కేంద్రం వద్ద ప్రతిపాధనలు ఉంచిన విషయం తెలిసిందే. దీనికి ఆమోదం తెలుపుతూ నవోదయ(Navodaya Vidyalaya), కేంద్రీయ విద్యాలయాల(Kendriya Vidyalaya) ఏర్పాటు దిశగా కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో 7 నవోదయ విద్యాలయాలు, ఏపీలో 8 కేంద్రీయ విద్యాలయాలు నెలకొల్పనున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు శుక్రవారం జారీ అయ్యాయి. ఈ విద్యాలయాలు తెలంగాణలోని జగిత్యాల, నిజామాబాద్, భద్రాద్రి, మేడ్చల్, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో నవోదయ విద్యాలయాలు.. ఏపీలోని చిత్తూరు, అనకాపల్లి, శ్రీసత్యసాయి, గుంటూరు, కృష్ణ, ఏలూరు, నంద్యాల జిల్లాల్లో కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు కానున్నాయి.