ఇంటర్ విద్యార్థులకు BIG అలర్ట్.. ఫలితాల విడుదల తేదీ అధికారిక ప్రకటన

ఇంటర్మీడియట్ విద్యా్ర్థులకు విద్యాశాఖ గుడ్ న్యూ్స్ చెప్పింది. ఫలితాల విడుదల తేదీని సోమవారం అధికారికంగా ప్రకటించింది.

Update: 2024-04-22 11:20 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇంటర్మీడియట్ విద్యా్ర్థులకు విద్యాశాఖ గుడ్ న్యూ్స్ చెప్పింది. ఫలితాల విడుదల తేదీని సోమవారం అధికారికంగా ప్రకటించింది. ఏప్రిల్ 24వ తేదీన ఉదయం 11 గంటలకు ఒకేసారి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదల చేయబోతున్నట్లు ఇంటర్ బోర్డు అధికారులు వెల్లడించారు. కాగా, ఇప్పటికే ఫలితాలు విడుదలకు సర్వం సిద్ధమైంది. స్పాట్ వాల్యుయేషన్, మార్కుల క్రోడీకరణ ప్రక్రియ కూడా పూర్తి అయింది. అయితే, ఈ ఏడాదికి ఇంటర్మీడియట్‌ పరీక్షలకు 9 లక్షల మందికిపైగా విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో 4,78,527 మంది ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఉన్నారు. 4 లక్షలకుపైగా సెకండ్ ఇయర్ విద్యార్థులు ఉన్నారు. వీరంతా రిజల్ట్స్(Telangana Inter Results) కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ ఫలితాలు విడుదల కావడంతో తెలంగాణ ఫలితాలు ఎప్పుడు విడుదలవుతాయా అని ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News