BREAKING: ఎమ్మెల్సీ కవిత నివాసానికి KTR, హరీష్ రావు.. ఇంట్లోకి అనుమతించని ఈడీ

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో సంచలం పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను

Update: 2024-03-15 12:47 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో సంచలం పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఈడీ అధికారులు కవితకు సెర్చ్ వారెంట్‌తో పాటు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. మరి కాసపేట్లో కవితను ఢిల్లీకి తరలించున్నారు. కవిత అరెస్ట్ నేపథ్యంలో మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ కవిత నివాసానిక చేరుకున్నారు. కేటీఆర్, హరీష్ రావులను ఈడీ అధికారులు బయటే అడ్డుకున్నారు.

ఇంట్లోకి వెళ్లేందుకు వారికి పర్మిషన్ ఇవ్వలేదు. కవిత అరెస్ట్ నేపథ్యంలో ఆమె నివాసం వద్ద హై టెన్షన్ నెలకొంది. బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా కవిత ఇంటి వద్దకు చేరుకున్నారు. ప్రధాని మోడీ, ఈడీలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. కవిత నివాసం వద్ద భారీగా భద్రతను పెంచారు. మరి కాసేపట్లో ఈడీ అధికారులు కవితను ఢిల్లీకి తరలించనున్నారు.

Read More..

Breaking News : ఎమెల్సీ కవిత అరెస్ట్.. మరి కాసేపట్లో ఢిల్లీకి తరలింపు..!  

Tags:    

Similar News