Nowhera Shaikh: హీరా గ్రూప్‌లో మరోసారి ఈడీ రెయిడ్స్

హీరా గ్రూప్‌లో మరోసారి ఈడీ రెయిడ్స్ కలకలం రేపాయి.

Update: 2024-08-03 13:01 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: హీరా గ్రూప్స్ స్కామ్‌ల వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు వేగవంతం చేసింది. తాజాగా మరోసారి హీరా గ్రూప్‌లో ఈడీ సోదాలు నిర్వహించింది. ఇవాళ తెల్లవారుజాము నుంచే హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నంలో ఏకకాలంలో ఈడీ బృందాలు సోదాలు నిర్వహిస్తున్నది. బంజారాహిల్స్‌లోని నౌహీరాషేక్ ఆఫీస్, ఇళ్లతో పాటు సంస్థ డైరెక్టర్లు, సీఈవోల ఇళ్లలోనూ ఈ రెయిడ్స్ కొనసాగుతున్నాయి. గతంలో నమోదైన కేసు ఆధారంగా ఈడీ ఈ తనిఖీలు నిర్వహించినట్లు తెలుస్తున్నది. స్కీముల పేరుతో రూ.వేల కోట్ల డిపాజిట్లు సేకరించి మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలపై హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ డైరెక్టర్ నౌహీరా షేక్‌పై ఇప్పటికే దేశవ్యాప్తంగా 60కి పైగా కేసులు ఉన్నాయి. ఈ వ్యవహారంలో ఇప్పటి వరకు ఈడీ రూ.380కోట్ల పైచిలుకు ఆస్తులను అటాచ్ చేసింది. టోలిచౌకీలోని ఎంఎస్పీ కాలనీలో ఉన్న మొత్తం రూ.80 కోట్ల విలువైన 81 ప్లాట్లు, హీరా గ్రూప్స్‌కు సంబంధించిన పలు స్థిరాస్తులు అటాచ్ చేసిన వాటిలో ఉన్నాయి.

Tags:    

Similar News