MLC కవిత ఆడపడుచు అఖిల ఇంట్లో ఈడీ దాడులు
హైదరాబాద్లో ఈడీ అధికారులు మరోసారి సోదాలు ప్రారంభించారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బంధువుల ఇళ్లే టార్గెట్గా దాడులు జరుపుతున్నారు.
దిశ, వెబ్డెస్క్/శేరిలింగంపల్లి: హైదరాబాద్లో ఈడీ అధికారులు మరోసారి సోదాలు ప్రారంభించారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బంధువుల ఇళ్లే టార్గెట్గా దాడులు జరుపుతున్నారు. శనివారం తెల్లవారుజాము నుంచే మాదాపూర్లోని కవిత ఆడపడుచు అఖిల నివాసంలో తనిఖీలు చేస్తున్నారు. అంతేకాదు.. కవిత భర్త అనిల్ కుమార్ బంధువుల ఇళ్లలోనూ విస్తృతంగా సోదాలు జరుపుతున్నారు. కాగా, ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో కవిత అరెస్ట్ అయి ఈడీ కస్టడీలో ఉన్నారు. కాగా, గత శుక్రవారం(మార్చి 15న) లిక్కర్ స్కాం కేసులో తీవ్ర స్థాయిలో ఆరోపణలు ఎదుర్కొంటుకున్న కవిత ఇంటిపై ఈడీ, ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. అనంతరం ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కవిత నుంచి సుమారు 16 మొబైల్ ఫోన్లను అధికారులు సీజ్ చేశారు. అనంతరం నేరుగా ఢిల్లీలోని ఈడీ ఆఫీసుకు తరలిచారు. ఆ తర్వాత రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చగా.. పది రోజుల కస్టడీ విధించింది.