బ్రేకింగ్: మాజీ ఎంపీ వివేక్‌పై కేసు నమోదు చేసిన ఈడీ
మాజీ ఎంపీ, చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి వివేక్ ఇళ్లు, కార్యాలయాల్లో జరిపిన సోదాలపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరేక్టరేట్ (ఈడీ) కీలక ప్రటకన
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: మాజీ ఎంపీ, చెన్నూరు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగడ్డం వివేకానందకు ఎన్నికల సమయంలో షాక్తగిలింది. వివేకానందకు చెందిన విశాఖ ఇండస్ర్టీస్లిమిటెడ్నుంచి విజిలెన్స్సెక్యూరిటీ సర్వీసెస్సంస్థకు వెళ్లిన 8 కోట్ల రూపాయలు వ్యాపారంలో భాగంగా జరిగిన లావాదేవీ కాదని ఈడీ అధికారులు తెలిపారు. ఇక, విజిలెన్స్సెక్యూరిటీ సంస్థ ఫెమా చట్టాన్ని ఉల్లంఘించిందని తెలిపారు. వివేకానంద కూడా ఈ చట్టాన్ని ఉల్లంఘించినట్టుగా పేర్కొన్న ఈడీ అధికారులు ఆయనపై ఫెమా చట్టం కింద కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. ఇటీవల విశాఖ ఇండస్ర్టీస్‌కు చెంది బేగంపేటలో ఉన్న ఓ బ్యాంకు నుంచి విజిలెన్స్సెక్యూరిటీ సర్వీసెస్‌కు చెందిన ఆదర్శ్‌నగర్‌లో ఉన్న బ్యాంక్అకౌంట్లోకి 8 కోట్ల రూపాయలు రియల్‌టైం గ్రాస్సెటిల్మెంట్పద్దతిన ట్రాన్స్ఫర్అయిన విషయం తెలిసిందే.
ఈ మేరకు సమాచారం అందుకున్న సైఫాబాద్పోలీసులు విజిలెన్స్సెక్యూరిటీ సర్వీసెస్‌కు చెందిన ఖాతా వివరాలను తెలుసుకుని ఆ 8 కోట్ల రూపాయలను ఫ్రీజ్‌చేశారు. ఈ సమాచారాన్ని ఈడీ, ఆదాయపు పన్ను శాఖతో పాటు జిల్లా ఎన్నికల రిటర్నింగ్అధికారికి తెలిపారు. ఈ క్రమంలోనే ఈడీ అధికారులు మంగళ, బుధవారాల్లో వివేకానందకు చెందిన ఇంటితో పాటు విశాఖ ఇండస్ర్టీస్, విజిలెన్స్సెక్యూరిటీ కార్యాలయాల్లో సోదాలు జరిపారు. వాస్తవానికి విజిలెన్స్సెక్యూరిటీ సర్వీసెస్వివేకానంద పరోక్ష నియంత్రణలో నడుస్తున్నట్టు ఈడీ అధికారులు పేర్కొన్నారు.
ఇటువంటి పరిస్థితుల్లో వివేకానంద, ఆయన భార్య, ఆయనకు చెందిన కంపెనీలు విజిలెన్స్సెక్యూరిటీ సర్వీసెస్‌తో 100 కోట్ల రూపాయల మేర లావాదేవీలు జరిపినట్టుగా తమ విచారణలో నిర్ధారణ అయ్యిందన్నారు. ఈ లావాదేవీల్లో 20లక్షల రూపాయల లాభం కూడా వచ్చినట్టు బ్యాలెన్స్షీట్లో పేర్కొన్నారన్నారు. విజిలెన్స్సెక్యూరిటీ సర్వీసెస్‌కు ధీర్ఘకాలిక రుణాలు, అడ్వాన్సులు రూపంలో 64 కోట్ల రూపాయల మేర ఆస్తులు ఉన్నట్టుగా తెలిపారన్నారు. ఇక, విచారణలో బ్యాంకు ఖాతాను విశ్లేషించినపుడు 200 కోట్ల రూపాయల మేర లావాదేవీలు జరిగినట్టుగా వెల్లడైందన్నారు. ఇక, విజిలెన్స్సెక్యూరిటీ సర్వీసెస్ఫెమా నిబంధనలను ఉల్లఘించినట్టుగా దర్యాప్తులో నిర్ధారణ అయ్యిందన్నారు. నిజానికి దీని మాతృసంస్థ యశ్వంత్రియల్టర్స్అని తేలిందన్నారు.
యశ్వంత్రియల్టర్స్కు చెందిన అత్యధిక షేర్లు ఓ విదేశీయుని పేరు మీద ఉన్నట్టు తెలిపారు. తనిఖీల్లో డిజిటల్డివైస్లు, డాక్యుమెంట్లు, కోట్లాది రూపాయల లెక్క లేని లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు దొరికాయన్నారు. దాంతోపాటు ప్రాపర్టీ డీల్స్‌లో పెట్టిన లెక్కల్లో చూపించని వందల కోట్ల రూపాయల వివరాలు లభ్యమైనట్టు తెలిపారు. గ్రూపులోని కంపెనీల్లో జరిగిన ఇంటర్నల్లావాదేవీలకు చెందిన సమాచారం కూడా దొరికినట్టు చెప్పారు. వాస్తవానికి విజిలెన్స్సెక్యూరిటీ సర్వీసెస్బోగస్సంస్థ, అది పేర్కొన్న చిరునామాలో ఎలాంటి ఆఫీస్లేదని వివరించారు.