గొర్రెల పంపిణీ స్కామ్‌పై ఈడీ దూకుడు.. పశుసంవర్ధక శాఖ ఆఫీస్‌లో సోదాలు..!

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన గొర్రెల పంపిణీ స్కీమ్‌లో జరిగిన అవకతవకలపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)

Update: 2024-06-14 05:38 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన గొర్రెల పంపిణీ స్కీమ్‌లో జరిగిన అవకతవకలపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లోని పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో ఈడీ అధికారులు సోదాలు చేపట్టినట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించిన వివరాలపై అధికారులు ఆరా తీస్తోన్నట్లు తెలుస్తోంది. పశుసంవర్ధ శాఖ హెడ్ ఆఫీస్‌లో ఈడీ తనిఖీలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. కాగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకంలో భారీగా అవకతవకలు జరిగినట్లు గుర్తించిన ఏసీబీ.. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసి విచారించింది.

అయితే, గొర్రెల పంపిణీ పథకంలో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో ఈడీ రంగంలోకి దిగింది. గొర్రెల పంపిణీ స్కీమ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని పశు సంవర్ధశాఖ అధికారులకు లేఖ రాసింది. అలాగే ఈ కేసును దర్యాప్తు చేస్తో్న్న తెలంగాణ ఏసీబీని సైతం కేసు అందించాలని ఈడీ కోరింది. ఈ కేసుకు సంబంధించి బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు సైతం ఈడీ సమన్లు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో నెక్ట్స్ ఈ కేసులో ఏం జరగబోతుందోనని తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈడీ ఎంట్రీతో మరిన్నీ సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


Similar News