హైడ్రా ఉద్దేశం వేరే! మీ పద్దతికి వ్యతిరేకం.. బీజేపీ ఎంపీ ఈటల ఆసక్తికర కామెంట్స్

హైడ్రా ఉద్దేశం వేరే ఉందని నేను చెప్పిన మాటలు ఇప్పటికీ ప్రజలు నమ్ముతున్నారని బీజేపీ నేత, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ హాట్ కామెంట్స్ చేశారు.

Update: 2024-10-22 09:41 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: హైడ్రా ఉద్దేశం వేరే ఉందని నేను చెప్పిన మాటలు ఇప్పటికీ ప్రజలు నమ్ముతున్నారని బీజేపీ నేత, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ హాట్ కామెంట్స్ చేశారు. మంగళవారం ఫతేనగర్ డివిజన్‌లో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్‌కు ఈటల రాజేందర్ హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూసీ ప్రక్షాళన తర్వాత ముందు మురికినీళ్లను శుద్ధి చేయండని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రసాయన వ్యర్థాలను శుద్ధి చేస్తేనే మూసీ బాగుపడుతుందని సూచించారు. తాము మూసీ ప్రక్షాళనకు వ్యతిరేకం కాదని, చేస్తున్న పద్ధతికి వ్యతిరేకమని అన్నారు. ప్రజల సమస్యల మీద నేను కొట్లడుతున్నారని, మీ సహకారం లేనిదే అది పూర్తి కాదని చెప్పారు.

ఎంత తిరిగినా ఒడవని నియోజకవర్గం మల్కాజిగిరి

నన్ను గెలిపించి నాలుగు నెలలు దాటిందన్నారు. ఈ నాలుగు నెలల కాలంలో ఢిల్లీ వెళ్ళినప్పుడు తప్ప ప్రతిరోజు మల్కాజిగిరి నియోజకవర్గంలోనే తిరుగుతున్నట్లు వెల్లడించారు. ఎంత తిరిగినా ఒడవని నియోజకవర్గం ఇదని, ఎంత విన్నా ఒడవని గాధ ఉంది ఇక్కడ అని తెలిపారు. కలెక్టర్‌ను,హెచ్ఎండీఏ కమిషనర్‌ను, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఎండీని ఎమ్మెల్యేలు అందరితో కలిసి కలిశామన్నారు. అక్కడికి వెళ్ళినా డబ్బులు లేవంటున్నారని, కేంద్రంలో అర్బన్ డెవలప్మెంట్ మంత్రిని కూడా కలిశామన్నారు. స్వచ్ఛ భారత్, స్మార్ట్ సిటీ కింద డబ్బులు ఇవ్వమని కోరినట్లు వెల్లడించారు. చెరువుల్లోకి మురుగునీటిని పోకుండా దారి మళ్లించేందుకు గతంలో "స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ కార్యక్రమం" తీసుకువచ్చిందన్నారు. దానికి కొన్ని నిధులు కేటాయించాలని కోరినట్లు వివరించారు. ఈ సమావేశంలో కార్పొరేటర్ మహేందర్, కూకట్పల్లి బీజేపీ ఇంచార్జ్ కాంతారావు, అసెంబ్లీ కన్వీనర్ శ్రీకర్ రావు, రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.


Similar News