దసరా ఎఫెక్ట్.. 9 రోజుల్లో రూ.713.25 కోట్ల అమ్మకం

తెలుగు రాష్ట్రాల్లో పండుగలంటే.. చాలు గుర్తొచ్చేది చుక్క, ముక్క. ఈ రెండు లేకుండా తెలంగాణలో ఏ పండుగలు జరగవు.

Update: 2024-10-11 06:42 GMT

దిశ, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో పండుగలంటే.. చాలు గుర్తొచ్చేది చుక్క, ముక్క. ఈ రెండు లేకుండా తెలంగాణలో ఏ పండుగలు జరగవు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వచ్చిందంటే చాలు.. మద్యం అమ్మకాలు పుంజుకుంటాయి. ఈ క్రమంలో వరుసగా వచ్చిన దసరా, దీపావళి పండుగలు, తెలంగాణ ప్రభుత్వానికి భారీగా ఆదాయాన్ని తెచ్చిపెడతాయి. ఇందులో భాగంగా దసరా పండుగ సీజన్ ప్రారంభం కావడంతో భారీగా అమ్మకాలు జరిగినట్లు తెలుస్తుంది. కేవలం తొమ్మిది రోజుల్లో ఏకంగా రూ.713.25 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్టు ఎక్సైజ్‌ శాఖ తెలపింది. కాగా పండుగ సీజన్ మరో రెండు రోజులు మిగిలి ఉండటంతో ఈ అమ్మకాల విలువ మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికి.. మద్యం అమ్మకాలు మాత్రం.. తెలంగాణ ప్రభుత్వానికి కాసుల వర్షం కురిపిస్తున్నాయనే చెప్పుకొవాలి.


Similar News