అసెంబ్లీలో బడ్జెట్ పద్దుల వేళ.. మంత్రులు, సభ్యుల స్పెషల్!
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఎనిమిదోరోజు సోమవారం కొనసాగాయి.

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఎనిమిదోరోజు సోమవారం కొనసాగాయి. ఈసందర్భంగా ప్రతిపక్ష బీఆర్ఎస్సభ్యులు నల్లబ్యాడ్జీలతో సభలోకి వచ్చారు. రెండు లక్షల రుణమాఫి పూర్తి చేయాలి.. మాట తప్పిన కాంగ్రెస్ప్రభుత్వం.. రుణమాఫీ బూటకం.. కాంగ్రెస్నాటకం అంటూ నినాదాలు చేశారు. రెండు లక్షల రుణమాఫీపై మాట తిప్పిన కాంగ్రెస్డౌన్డౌన్ అంఉటు నినాదాలు చేశారు.
బీఆర్ఎస్ వాయిదా తీర్మానం..
సభ ప్రారంభం కాగానే రూ. 2 లక్షల సంపూర్ణ రుణమాఫీ కోసం బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. వరంగల్ రైతు డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలోని రైతులందరికీ రుణమాఫీ చేయాలని కోరుతూ చర్చకు బీఆర్ఎస్ సభ్యులు స్పీకర్‌కు వాయిదా తీర్మానం ఇచ్చారు.
పల్లాగారు.. మీరు కూర్చోండి..
కాగా, బడ్జెట్పద్దుల చర్చాకు స్పీకర్‌గడ్డం ప్రసాద్అవకాశం ఇచ్చారు. సభలో రైతు మాఫీ విషయంలో ప్రతిపక్ష బీఆర్ఎస్సభ్యులు వివేకానంద విమర్శలపై మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు కౌంటర్ఇచ్చారు. ఇదే సమయంలో తుమ్మల మాట్లాడుతుండగా బీఆర్ఎస్ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి కామెంట్చేశారు. దీంతో రైతు పల్లాగారు రైతు బంధు అధ్యక్షుడిగా రైతు బంధు గురించి నాకు తెలుసు.. మీరు కూర్చోండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పొన్నంతో కేటీఆర్ ముచ్చట..
అసెంబ్లీ హౌస్ మంత్రి పొన్నం ప్రభాకర్, బీఆర్ఎస్వర్కింగ్ప్రెసిడెంట్కేటీఆర్ముచ్చటించుకున్నారు. సభలో బడ్జెట్పద్దులపై వాడివేడీగా చర్చా కొనసాగుతున్నది. బీర్ఆర్ఎస్ తరుపున ఎమ్మెల్యే వివేకానంద ప్రసంగం ముగిశాక రంగారెడ్డి ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతున్నారు..ఈక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్వద్దకు వచ్చిన కేటీఆర్.. మంత్రి పక్కనే పది నిమిషాలపాటు కూర్చోని ముచ్చటించుకున్నారు. ఇరువురు ముచ్చటించుకోవడం సభలో ఆసక్తి నెలకొన్నది.
శ్రీధర్‌బాబుతో.. మల్లారెడ్డి
సభలో చర్చా కొనసాగుతన్న వేళ అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో బీఆర్ఎస్ఎమ్మెల్యే మల్లారెడ్డి ముచ్చటించారు. మల్లారెడ్డి స్వయంగా శ్రీధర్‌బాబు చైర్‌వద్దకు వెళ్లి కూర్చోవడం ఆశ్చర్యకరంగా మారింది.
నవ్వులు పూయించిన అక్భరుద్దీన్..
ఎంఐఎం పార్టీ ఫ్లోర్‌లీడర్ అక్భరుద్దీన్ ఓవైసీ సభలో ఫన్నీ స్టోరీ చెప్పారు. ఓవైసీ ఫేకుడు స్టోరీతో సభలో ఒక్కసారిగా నవ్వులు విరబూశాయి. ఆయన చెప్పిన స్టోరీతో సభ్యులంతా నవ్వారు. ‘‘హైదరాబాద్‌లో ఫేకులు ఉండేవారు. ఇద్దరు కూడా ఫేకుల్లో పెద్దలు. ఒకసారి ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ.. ఒకరికి మించి ఒకరు ఇలాగా గొప్పలు చెప్పుకుంటారు సార్” అని స్పీకర్ అక్బరుద్దీన్ వ్యాఖ్యనించారు. ‘‘ ఫస్ట్ ఫేకు మా తాత దగ్గర ఉన్న భూమిలో విత్తనం వేసుకుంటూ పోతే.. చివరి విత్తనం వేసే తిరిగి వచ్చే సమయానికి పంట రెఢీ అయి కోతకు వచ్చేస్తుందని చెబుతాడు.. ‘‘సెకండ్ఫేకు.. మా తాత దగ్గర పేద్ద వెదురు బొంగు ఉండేది.. ఆ బొంగుతో అకాశంలోని చుక్కలను అటు ఇటు జరిపేంతా పేద్దగా ఉండేదని అంటాడు’’.. అంతా పెద్ద బొంగును ఎక్కడ దాచి పెడుతారు అని ఫస్ట్పేకు అడుగుతాడు.. మీ తాత భూమిలో దాచుతామని సెకండ్ ఫేకు సమాధాం ఇస్తాడని చెప్పడంతో సభలో నవ్వులు విరబూశాయి. పాలకులు ఇచ్చే హామీలు, అవి అమలు తీరు, ప్రజలు అందే ప్రయోజనాలను ఉద్దేశించి అక్బరుద్దీన్ ఫన్నీ స్టొరీతో సర్కారుపై విమర్శలు చేశారు.