స్టేట్ క్రిస్టియన్ మైనార్టీ పైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా రాజేశ్వర్ రావు

రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా డి.రాజేశ్వర్ రావు నియామకం అయ్యారు.

Update: 2023-08-10 16:46 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా డి.రాజేశ్వర్ రావు నియామకం అయ్యారు. గురువారం రాష్ట్ర ప్రభుత్వం నియామక ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్లపాటు ఈ పదవిలో ఆయన కొనసాగనున్నారు. 2005 నుంచి 2007 హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా రాజేశ్వర్ రావు పనిచేశారు. 2007 నుంచి 2014, జూన్ 1 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యుడిగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014, జూన్ 2 నుండి 2017, మే 27 వరకు తెలంగాణ శాసనమండలి సభ్యుడిగా పనిచేశారు. 2017, మే 28న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున గవర్నర్ కోటాలో శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఈ ఏడాది మేలో ఎమ్మెల్సీ పదవీ కాలం ముగిసింది. అయితే ఆయనకు తిరిగి ప్రభుత్వం కార్పొరేషన్ బాధ్యతలను అప్పగించింది.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..