పేషెంట్ మద్యం మత్తులో ఆసుపత్రికి వచ్చాడు.. నిజామాబాద్ ఏరియా ప్రభుత్వాసుపత్రి సూపరిండెంట్

నిజామాబాద్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్ ను కాళ్లు పట్టుకొని ఈడ్చుకెళ్లిన ఘటనపై ఆ ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ ప్రతిమా రాజ్ స్పందించారు.

Update: 2023-04-15 10:56 GMT

దిశ, వెబ్ డెస్క్: నిజామాబాద్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్ ను కాళ్లు పట్టుకొని ఈడ్చుకెళ్లిన ఘటనపై ఆ ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ ప్రతిమా రాజ్ స్పందించారు. పేషెంట్ ను కాళ్లు పట్టుకొని లాక్కెళ్లింది ఆసుపత్రి సిబ్బంది కాదని.. అతడి బంధువులని తెలిపారు. ఆసుపత్రిలో స్ట్రెచర్ ల కొరత లేదని.. సదరు పేషెంట్ 15 రోజుల కిందట మద్యం మత్తులో ఆసుపత్రికి వచ్చారని చెప్పారు. మద్యం మత్తులో కనీసం నడవడానికి కూడా వీలులేని స్థితిలో ఉన్న పేషెంట్ ను అతడి బంధువులు లోపలికి ఈడ్చుకు వచ్చారని, అయితే సిబ్బంది చూసి వెంటనే స్పందించారని తెలిపారు.

అక్కడి నుంచి వెయింటింగ్ హాల్ వరకు వీల్ చైర్ లోనే తీసుకొచ్చారని స్పష్టం చేశారు. నిజామాబాద్ ఏరియా ఆసుపత్రికి రాష్ట్రంలోనే మంచి పేరు ఉందని, ఇలా తప్పుడు ప్రచారంతో ఆసుపత్రికి చెడ్డ పేరు తీసుకురావొద్దని ఆమె కోరారు. కాగా పేషెంట్ ను ఈడ్చుకెళ్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కాగా రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

Tags:    

Similar News