బీఎడ్ (ఓడియల్) సర్టిఫికెట్ల వెరిఫికేషన్..

డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం 2022-23 సంవత్సరానికి బి.ఎడ్ (ఓడియల్) లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంపికైన అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్

Update: 2023-10-04 13:57 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం 2022-23 సంవత్సరానికి బి.ఎడ్ (ఓడియల్) లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంపికైన అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. బీఎడ్ (ఓడియల్)లో ఎంపికైన అభ్యర్థులు తప్పనిసరిగా వెరిఫికేషన్ కోసం ఒరిజినల్ సర్టిఫికేట్‌లతో అక్టోబర్ 7, 2023 లోపు ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 3:30 వరకు వరకు తప్పనిసరిగా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో హాజరుకావాలని సూచించారు. ఎంపికైన అభ్యర్థుల జాబితా విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు వెల్లడించారు. మరిన్ని వివరాల కోసం విశ్వవిద్యాలయ పోర్టల్‌ను www.braouonline.in లేదా www.braou.ac.in సందర్శించాలని తెలిపారు.


Similar News