అయోధ్య రామ మందిరంపై రాజకీయాలు చేయొద్దు : బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ

ఆయోధ్య రామ మందిరంపై రాజకీయాలు చేయడం సరికాదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు.

Update: 2024-01-18 05:56 GMT

దిశ, వెబ్‌డెస్క్ : అయోధ్య రామ మందిరంపై రాజకీయాలు చేయడం సరికాదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. 500 ఏళ్ల తరువాత శ్రీరాముడు అయోధ్యకు వస్తున్న తరుణంలో ఆయా పార్టీలు రామ మందిరం పట్ల ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో బీఆర్ఎస్‌పై ఉన్న వ్యతిరేకతతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ ప్రభంజన సృష్టించబోతోందని, 10 నుంచి 12 సీట్లు తమ పార్టీ కైవసం చేసుకోబోతోందని జోస్యం చెప్పారు. మూడోసారి మోడీ ప్రధాని కావాలంటూ ప్రజలు ఆంకాంక్షిస్తున్నారని తెలిపారు.

Tags:    

Similar News