Rythu Bharosa: రైతు భరోసాపై వారి మాటలు నమ్మకండి మంత్రి తుమ్మల

రైతు భరోసాపై మంత్రి తుమ్మల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-12-31 12:55 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతుభరోసా (Rythu Bharosa) పథకాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వుం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara) కీలక వ్యాఖ్యలు చేశారు. పంట వేసిన ప్రతి రైతుకు రైతుభరోసా ఇవ్వాలన్నది ప్రభుత్వ ఉద్దేశం అని అన్నారు. మంగళవారం ఖమ్మం జిల్లాలో మాట్లాడిన ఆయన రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. రైతు భరోసా విషయంలో ప్రతిపక్షాల ఆరోపణలను ప్రజలు పట్టించుకోవద్దని సూచించారు.    

Tags:    

Similar News