KTR:‘ఏం జరిగినా ఆశ్చర్యపోవద్దు’.. కార్యకర్తలకు కేటీఆర్ కీలక సూచనలు!

రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్(BRS) పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

Update: 2024-10-29 08:13 GMT

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్(BRS) పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడేంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) పార్టీ కార్యకర్తలకు కీలక సూచనలు చేశారు. రెండు రోజులుగా జరుగుతుంది కేవలం ఆరంభమేనని, రాబోయే రోజుల్లో మరిన్ని కష్టాలు ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉండాలని బీఆర్‌ఎస్ కార్యకర్తలు(BRS workers), సోషల్ మీడియా(Social media) సభ్యులను ఉద్దేశిస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు. త్వరలో మన పై కేసులు పెట్టడం, తప్పుడు ప్రచారం చేయడం చూస్తాం అని కేటీఆర్ తెలిపారు. బీజేపీ(BJP), కాంగ్రెస్, టీడీపీ(TDP) పెయిడ్ సోషల్ మీడియా ట్రోల్స్ మనల్ని టార్గెట్ చేస్తాయి. ఏం జరిగినా ఆశ్చర్యపోవద్దు అని పేర్కొన్నారు. వాటిని మీ దృష్టి మరల్చనివ్వద్దు అని కేటీఆర్ ట్విట్టర్(KTR Twitter) వేదికగా పేర్కొన్నారు.


👉Also Read: Congress vs KTR: పెయిడ్ ఆర్టిస్ట్‌లతో కుట్ర చేస్తోందంటూ ఫైర్ 

Tags:    

Similar News