ఉచిత బస్సు ప్రయాణం కేవలం వారికే వర్తించనుందా?
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీఆర్‌ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ చిత్తుచిత్తుగా ఓడించింది.
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీఆర్‌ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ చిత్తుచిత్తుగా ఓడించింది. దీంతో రేవంత్ రెడ్డి ఘన విజయం సాధించి సీఎం పదవిని సంపాదించుకున్నారు. ఆయన గురువారం ఎల్బీ స్టేడియంలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగానే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీలను అమల చేస్తామని మరోసారి తేల్చి చెప్పారు. అందులో ముఖ్యమైనది మహిళకు ఉచిత బస్సు ప్రయాణం. శనివారం డిసెంబర్ 9 నాడు సోనియా గాంధీ పుట్టినరోజు కావడంతో ఉచిత బస్సు ప్రయాణం పథకం ప్రారంభం కానుందని ప్రభుత్వం ప్రకటించింది. అందుకు ఏదైనా గుర్తింపు కార్డ్ చూపించాలని సూచించారు. దీనిపై ఈరోజు రేవంత్ రెడ్డి అధికారులతో చర్చించనున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సౌకర్యం తెలంగాణ రాష్ట్రానికి చెంది మహిళలకు మాత్రమే వర్తిస్తుందని ఓ వార్త వైరల్ అవుతోంది. ఇతర రాష్ట్రాల మహిళలు బస్సుల్లో ఛార్జీ చెల్లించాల్సిందేనని అందుకు గుర్తింపు కార్డ్ నిబంధన పెట్టారని ఓ ప్రచారం జరుగుతుంది. ఇందులో నిజమెంత అనేది తెలియాలంటే.. ఇక దీనిపై రేవంత్ రెడ్డి ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌తో భేటీ తర్వాత దీనిపై క్లారిటీ రానుంది.
Read More..