భారత్‌లో అత్యధిక క్రిమినల్ కేసులున్న సీఎంగా కేసీఆర్
భారతదేశంలో అత్యధిక కేసులున్న సీఎంలలో సౌత్ ఇండియాకు చెందిన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ సీఎంలే టాప్‌లో ఉన్నారు.
దిశ, వెబ్‌డెస్క్: భారతదేశంలో అత్యధిక కేసులున్న సీఎంలలో సౌత్ ఇండియాకు చెందిన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ సీఎంలే టాప్‌లో ఉన్నారు. ఇందులో తెలంగాణ సీఎం కేసీఆర్‌పై 64 కేసులు ఉన్నట్టు సమాచారం. ఇందులో 34 సీరియస్ ఐపీఎస్ కేసులు ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి..38 కేసులు ఉండగా ఇందులో 35 సీరియస్ క్రిమినల్ కేసులు ఉన్నాయి. అలాగే మూడో స్థానంలో తమిళనాడు సీఎం డీఎమ్‌కే అధినేత ఎంకే స్టాలిన్ ఉన్నారు.
ఇతనిపై 47 కేసులుండగా.. వాటిల్లో 27 క్రిమినల్ కేసులు ఉన్నట్టు సమాచారం. అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (ఆప్), మిజోరం సీఎం జోరంతంగా (మిజో నేషనల్ ఫ్రంట్)పై ఒక్కొక్కరిపై మూడు క్రిమినల్ కేసులు ఉండగా, కేరళ సీఎం పినరయి విజయన్ (సీపీఐ-ఎం), బీహార్ సీఎం, జేడీ(యూ) నేత నితీశ్ కుమార్‌పై రెండు క్రిమినల్ కేసులు ఉన్నాయి.
వీరితో పాటు మహారాష్ట్ర, హిమాచల్‌ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, సిక్కిం, పంజాబ్ ముఖ్యమంత్రులపై ఒక్కొక్కరిపై ఒక్కో క్రిమినల్ కేసు ఉన్నట్లు వారి ఎన్నికల అఫిడవిట్‌లో తెలిపారు. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే 43 శాతం మంది ముఖ్యమంత్రులు తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు వారే ప్రకటించుకున్నారు. మొత్తం 30 మంది రాజకీయ నాయకులలో 13 మందిపై క్రిమినల్ కేసులు ఉన్న వారు లిస్టులో ఉన్నారు. వీరిలో కొందరు ఎదుర్కొంటున్న క్రిమినల్ కేసుల్లో హత్య, హత్యాయత్నం, కిడ్నాప్, క్రిమినల్ బెదిరింపులకు సంబంధించినవి ఉన్నాయి.