Khairatabad Ganesh : ఖైరతాబాద్ ‘బడా గణేష్’ హుండీ ఆదాయం ఎంతో తెలుసా?

ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆ మహాగణపతి నిమజ్జనం రేపే కావడంతో దర్శనాలు నిలిపివేసిన కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.

Update: 2024-09-16 14:27 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆ మహాగణపతి నిమజ్జనం రేపే కావడంతో దర్శనాలు నిలిపివేసిన కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అయితే, ఖైరతాబాద్‌లో గణేష్ ఉత్సవాల 70 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా హుండీలను లెక్కిస్తున్నారు. మొట్టమొదటిసారి సీసీ కెమెరాల పర్యవేక్షణలో హుండీ లెక్కింపు ప్రక్రియ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఖైరతాబాద్ మహాగణపతి హుండీ ఆదాయం రూ. 70 లక్షల వరకు సమకూరినట్లు తెలిసింది.

హోర్డింగులు, ఇతర సంస్థల ప్రకటన రూపంలో మరో రూ. 40 లక్షలు ఆదాయం వచ్చింది. పది రోజుల్లో నగదు రూపంలో ఈ ఆదాయం సమకూరినట్లు ఉత్సవ కమిటీ తెలిపింది. అదేవిధంగా ఆన్‌లైన్, స్కానర్ల ద్వారా వచ్చిన ఆదాయం ఇంకా లెక్కించాల్సి ఉన్నది. కాగా, ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం మంగళవారం జరుగనుంది. ఇవాళ రాత్రి మహా హారతి, కలశం పూజా కార్యక్రమాలు నిర్వహించి రాత్రి 12 గంటల తర్వాత టస్కర్ (ట్రక్)‌పైకి ఎక్కిస్తారు. రేపు మధ్యాహ్నం 2 గంటలకు నిమజ్జనం పూర్తి చేసేందుకు అధికారులు, నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.

 


Similar News